Neutral Uniforms
Neutral Uniform: స్కూళ్లోని బాలబాలికలకు ఒకే రకమైన యూనిఫామ్ కేటాయించి వార్తల్లో నిలిచిన కేరళ స్కూల్ సంప్రదాయం మరో అడుగు ముందుకేసింది. విద్యార్థుల విషయంలోనే కాదు విద్యను బోధించే అధ్యాపకులలోనూ అదే సమానత్వం ఉండాలని ఒకే పేరును సూచించారు. స్థానికుల మీడియా ప్రకారం.. కేరళలో తొలి స్కూల్ మేడమ్, సార్ అనే పదాలకు బదులు టీచర్ అనే పదాన్నే ఉపయోగించాలని వెల్లడించింది.
మొత్తం 300మంది ఉన్న ఆ స్కూల్లో.. తొమ్మిది మంది మహిళా టీచర్లు, ఎనిమిది మంది మగ టీచర్లు ఉన్నారు. ముందుగా స్టాఫ్ మెంబర్స్ లో ఒకరు ఈ ఆలోచనతో ముందుకొచ్చారని ఆ తర్వాత స్టాఫ్ కౌన్సిల్ ఆమోదం పొంది టీచర్ అనే పిలవాలని ఫిక్స్ అయినట్లు సీనియర్ బేసిక్ స్కూల్ ప్రిన్సిపాల్ వేణుగోపాలన్ తెలిపారు. సోషల్ యాక్టివిస్ట్ బోబన్ మత్తుమంత ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునే ఇలా చేశామని అన్నారు.
దీనినే అనుసరిస్తూ.. పలక్కడ్‌లోని మథుర్ గ్రామ్ పంచాయతీ సభ్యులను సార్, మేడమ్ అని పిలవడాన్ని నిషేదించింది. పంచాయతీని అడ్రస్ చేస్తూ రాసే ఉత్తరాల్లో అలా సంభోదించడాన్ని ఖండించింది. పంచాయతీ కమిటీ లేదా ఆఫీస్ స్టాఫ్ అని పేర్కొంటూ లేఖ రాయాలని చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: 981 రైళ్లను రద్దు చేసిన ఇండియన్ రైల్వేస్
కేరళలో ఇప్పటికే చాలా స్కూల్స్‌లో యూనిసెక్స్ యూనిఫామ్ అమల్లో ఉంది.