శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లుగా..అక్రమ రవాణాలపై పోలీసులు నిరంతరం నిఘా పెడుతున్నా స్మగ్లర్లు మాత్రం వారి వారి రవాణాలను చేస్తునే ఉన్నారు. రైలులో అక్రమంగా భారీ ఎత్తున తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. రాజధాని ఢిల్లీ – ఎన్‌సిఆర్ మధ్య నడుస్తున్న EMU రైలులో మద్యం అక్రమ రవాణాకు జరుగుతోందనే సమాచారంతో మంగళవారం (ఆగస్టు 27)న ఘజియాబాద్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో అక్రమరవాణాదారులు తప్పించుకోగా..పోలీసులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి బీహార్ కు అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు గుర్తించారు.
బీహార్‌లో మద్యపాన నిషేధం అమలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వివిధ ప్రాంతాల నుంచి బీహార్ కు మద్యాన్నిపలు మార్గాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టగా భారీగా మద్యం పట్టుబడింది.
Ghaziabad: Illicit liquor recovered by Railway Police at Ghaziabad Railway Station yesterday. The liquor was brought from Delhi to Ghaziabad in EMU train that operates in Delhi NCR. The liquor was to be sent to Bihar. Police investigation underway pic.twitter.com/wKNIgr67Uh
— ANI UP (@ANINewsUP) August 27, 2019