Dogs Attacked Girl : ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. కుక్కల దాడినుంచి తృటిలో తప్పించుకున్న ఐదేళ్ల చిన్నారి
ఒళ్లు గగ్గురపొడిచే వీడియో.. కుక్కల దాడినుంచి తృటిలో తప్పించుకున్న ఐదేళ్ల చిన్నారి
- Harish Thanniru
- Updated on- March 10, 2024 / 04:12 PM IST
Dogs Attacked Girl
Uttar Pradesh : ఒళ్లు గగుర్పొడిచే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో వీధి కుక్కలు ఐదేళ్ల చిన్నారిపై దాడికి యత్నించాయి. కొద్దిదూరం ఆ చిన్నారిని లాక్కొని వెళ్లాయి. ఈ ఘటన యూపీలోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి కుక్కలను తరిమేయడంతో చిన్నారి ప్రాణాలతో బయటపడింది. చిన్నారిపై కుక్కలు దాడిచేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వెంటనే చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
Also Read : Ambati Rambabu : జనసేనాని పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మంత్రి అంబటి ట్వీట్..!
అమ్రోహా జిల్లా నగర్ కొత్వాలి ప్రాంతంలోని జామా మసీదు ఏరియాలో రాత్రివేళలలో ఐదేళ్ల చిన్నారి ఒంటిరిగా వెళ్తుంది. ఈ క్రమంలో ఐదారు వీధి కుక్కలు ఆ చిన్నారిని వెంబడించాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది. కుక్కలన్నీ ఒక్కసారిగా చిన్నారి గౌనును పట్టుకొని రోడ్డపైకి లాక్కొచ్చాయి. దాడిచేసే సమయంలో ఓ యువకుడు వచ్చి వీధి కుక్కలను తరిమికొట్టాడు. చిన్నారిని దగ్గరికి తీసుకున్నాడు. ఇంతలో పాప కుటుంబీలకు వచ్చారు. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
Also Read : Viral Video : ఆమ్లెట్‌ను ఇలా తిప్పాలని తెలియక.. ఇన్నాళ్లు గరిటెలు, స్పూన్లు వాడాము.. నీకో దండం!
గతంలో కూడా కాన్పూర్ లో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనూ గతంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలున్నాయి. ప్రస్తుతం యూపీలోని చిన్నారిపై వీధికుక్కలు దాడికి యత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
