Viral Video : ఆమ్లెట్‌ను ఇలా తిప్పాల‌ని తెలియ‌క‌.. ఇన్నాళ్లు గ‌రిటెలు, స్పూన్లు వాడాము.. నీకో దండం!

కొంచెం టేస్టీగా, చాలా వేగంగా త‌యారు చేసుకునే అల్పాహార వంట‌కాల‌లో ఆమ్లెట్ ఒక‌టి.

Viral Video : ఆమ్లెట్‌ను ఇలా తిప్పాల‌ని తెలియ‌క‌.. ఇన్నాళ్లు గ‌రిటెలు, స్పూన్లు వాడాము.. నీకో దండం!

Viral Video Woman Uses Threads To Flip Omelette

కొంచెం టేస్టీగా, చాలా వేగంగా త‌యారు చేసుకునే అల్పాహార వంట‌కాల‌లో ఆమ్లెట్ ఒక‌టి. ఎంతో మందికి చాలా ఇష్టం ఇది. దీన్ని త‌యారు చేయ‌డం ఎంతో సులువు. గుడ్ల‌ను ప‌గుల కొట్టి ఓ గిన్నెలోకి తీసుకుని ఉప్పు, కారం వేసుకుని అవ‌స‌రం అనుకుంటే కొన్ని త‌రిగిన కూర‌గాయలు, మ‌సాలా కొంచెం వేసుకుని బాగా క‌ల‌పాలి. ఆ త‌రువాత స్ట‌వ్ పై ప్యాన్‌ను పెట్టి కొంచెం వేడి అయిన త‌రువాత ఆ మిశ్ర‌మాన్ని దాని పై పోస్తే చాలు.. ఎంచ‌క్కా ఆమ్లెట్ రెడీ అవుతుంది.

అయితే.. ఆమ్లెట్ ఓ సైడ్ కాలిన త‌రువాత మ‌రో సైడ్‌కు తిప్పే క్ర‌మంలో ఒక్కొసారి ఆమ్లెట్ ముక్క‌లు అవుతుంటూ ఉంటుంది. లేదంటే పాన్‌కు అతుక్కుపోతూ ఉంటుంది. దీనికి ఓ మ‌హిళ చూపించిన ప‌రిష్కారం ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఎలాంటి గ‌రిటెలు, స్పూన్‌లు అవ‌స‌రం లేకుండా స‌ద‌రు మ‌హిళ ఆమ్లెట్‌ను దారాల సాయంతో మ‌రోసైడ్‌కు తిప్పింది.

Viral Video : వార్నీ వీడి క్రియేటివిటీ చూడండి.. ఒకేసారి 5 ఫోన్స్‌తో షూటింగ్

ఇంత‌కీ వీడియోలో ఏం ఉందంటే.. ఓ మ‌హిళ ముందుగా స్ట‌వ్ పై ప్యాన్‌ను పెట్టింది. రెండు పొడ‌వాటి దారాల‌ను తీసుకుని వాటిని ప్యాన్ పై క్రాస్ (ఎక్స్‌) ఆకారంలో ఉంచింది. ఆ త‌రువాత ఎగ్స్ మిశ్ర‌మాన్ని దానిపై పోసింది. ఓ వైపు కాలిన త‌రువాత ఆమె ఆమ్లెట్‌ను తిప్ప‌డానికి గ‌రిటెను ఉప‌యోగించ‌లేదు. గ‌రిటెకు బ‌దులుగా రెండు దారాలను ఉప‌యోగించి పైకి లాగి రెండో సైడ్‌కి తిప్పింది. ఆమ్లెట్ రెడీ అయిన త‌రువాత ఎంచ‌క్కా దారాల‌ను తీసి వేసింది.

ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. స‌మస్య‌కు ప‌రిష్కారం దొరికింద‌ని ఒక‌రు, మీకో దండం త‌ల్లీ అని మ‌రొక‌రు, మీకోసం నాసా ఎదురుచూస్తుంద‌ని ఇంకొక‌రు కామెంట్లు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Sreenivas.Muppana (@supersreenivas)