వావ్.. చీరలోనూ జిమ్నాస్టిక్స్ సాధ్యమే, వైరల్‌గా మారిన యువతి విన్యాసాలు

  • Publish Date - September 9, 2020 / 01:13 PM IST

చీరకట్టులో మామూలుగా నడవటానికే ఎంతో ఇబ్బందిగా ఫీల్ అవుతారు ఈ కాలం అమ్మాయిలు. చీరను చాలా అన్ కంపర్ట్ గా భావించే వారూ ఉన్నారు. శారీలో ఉంటే పనులు చేయడం కష్టం అని చెబుతున్నారు. కానీ, అదే చీరలో ఏకంగా జమ్నాస్టిక్స్ చేయగలిగితే.. నమ్మబుద్ధి కావడం లేదా. కానీ ఇది నిజమే. చీరలోనూ జిమ్నాస్టిక్స్ చేయడం సాధ్యమే అని ప్రూవ్ చేసింది ఓ యువతి. చీరలో తన విన్యాసాలతో అందరి చేత వావ్ అనిపిస్తోంది.

ఆమె పేరు పారుల్ అరోరా. జిమ్నాస్ట్ మరియు ఫిట్ నెస్ మోడల్. హరియాణాలోని అంబాలాలో ఉంటుంది. పారుల్‌ 14 ఏళ్లుగా జిమ్నాస్టిక్స్‌లో శిక్షణ పొందుతోంది. పారుల్‌ చీరతో ఏకంగా జిమ్నాస్టిక్‌ విన్యాసాన్ని ప్రదర్శించి అందరినీ నివ్వెర పోయేలా చేసింది.

ఒక్క చీరలోనే కాదు సల్వార్‌ కమీజ్‌, స్కర్ట్, గౌను, పంచె.. ఇలా రకరకాల దుస్తుల్లో ఇంద్రధనసులా తన ఒంటిని వంచింది. పారుల్‌ చీరకట్టు విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటికే 10 లక్షలకు పైగా వ్యూస్‌ దక్కాయి. 7 లక్షలకు పైగా లైక్స్ కూడా వచ్చాయి.



https://10tv.in/ipl-2020-delhi-capitals-dc-unveils-their-new-jersey-for-13th-season/
చీరలో పారుల్ అరోరా విన్యాసాలు చూసినోళ్లు వావ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ స్టంట్ అని కితాబిస్తున్నారు. పారుల్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చీరలో పారుల్ చేసిన బ్యాక్ ఫ్లిప్ స్టంట్ కు నెటిజన్లు ఫిదా అయ్యారు. వావ్ సూపర్బ్ అంటున్నారు. మీరు తప్ప చీరలో ఇలాంటి స్టంట్ ఎవరూ చేయలేరని కామెంట్ చేస్తున్నారు. చీరలో ఇలాంటి స్టంట్లు చేయడం చాలా కష్టం అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

పారుల్ అరోరా అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది, రియల్లీ గ్రేట్ అని మరో నెటిజన్ కితాబిచ్చాడు. సీక్రెట్ ఏజెంట్ ఇన్ శారీ, జస్ట్ లైక్ మూవీస్.. అని మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. పారుల్ అరోరా తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో షేర్ చేసిన స్టంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. లక్షల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఆమె టాలెంట్ కి అంతా ఫిదా అయిపోయారు.