Educattion Minister
Education Minister: రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఇందర్ సింగ్ పర్మార్ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారు పేరెంట్స్. స్కూల్ ఫీజులు పెరిగిపోయాయి కట్టలేకపోతున్నాం అని చెప్పుకున్నారు. ‘వెళ్లి చావండి, మీకిష్టమైంది చేసుకోండి’ అంటూ తిట్టిపోసిన మంత్రి కామెంట్లు ఇప్పుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
మధ్యప్రదేశ్ లోని మహాసంఘ్ కు చెందిన విద్యార్థుల 80 మంది పేరెంట్స్ విద్యాశాఖ మంత్రి అధికార నివాసానికి వెళ్లారు. చాలా స్కూళ్లు.. అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని, స్కూల్స్ కేవలం ట్యూషన్ ఫీజులు మాత్రమే తీసుకోవాలని ఆల్రెడీ కోర్టు తీర్మానించిందని ఫిర్యాదు చేశారు.
ఇవన్నీ.. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని మంత్రిని నిలదీశారు. ఆ ప్రశ్నలకు వారికి అందిన రెస్పాన్స్ తో అంతా షాక్ అయ్యారు. ‘వెళ్లి చావండి. లేదంటే మీకిష్టమైంది చేసుకోండి’ అంటూ కామెంట్ చేశారు.
ఇక అంతే మంత్రి కామెంట్లకు అసలే ఆగ్రహంతో ఉన్న పేరెంట్స్ కు ఆవేశం తోడై ఆయన ఇంటి ముందే దురుసుగా మాట్లాడిన మంత్రి రాజీనామా చేయాలంటూ ధర్నాకు దిగారు. దీనిపై మీడియాతో మాట్లాడిన మంత్రి పేరెంట్స్ కు క్షమాపణ కోరుతున్నానని.. పేరెంట్స్ అడిగినట్లు చేయలేకపోతే రాజీనామా చేస్తానంటూ హామీ ఇచ్చారు.