Gold Rate : గుడ్ న్యూస్ .. తగ్గిన బంగారం, వెండి ధరలు

బంగారం ధర స్వల్పంగా తగ్గగా.. వెండి ధర అమాంతం తగ్గింది. కిలో వెండిపై ఒకే రోజు రూ.5300 తగ్గింది. ఆదివారం కిలో వెండి 61,700 లకు చేరింది

Gold Rate

Gold Rate : పసిడి ప్రియులకి ఇది శుభవార్త.. బంగారం ధర ఆదివారం తగ్గింది. బంగారం కొనాలి అనుకునేవారికి ఇది మంచి సమయమని బిలియన్ నిపుణులు చెబుతున్నారు. కాగా గడిచిన 10 రోజుల్లో బంగారంపై రూ.1100 పెరిగింది.. అదే సమయంలో మూడు వందలు తగ్గింది. అయితే నికరంగా బంగారంపై గడిచిన పది రోజుల్లో రూ.800 పెరిగిందని చెప్పవచ్చు.

రాఖీ పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గుతుండడం.. అతివలకు ఊరట కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గి రూ.46,210కి దిగొచ్చింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి 48,170కి చేరింది. ఇక బంగారంపై పెట్టుబడి పెట్టేవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ సంక్షోభంతోపాటు.. తాలిబన్ల సమస్య కూడా ఉండటంతో చాలామంది బంగారంపై పెట్టుబడులు పెట్టెదనుకే మొగ్గుచూపుతున్నారు.

ఇక దేశంలోని వివిధ నగరాల్లోని బంగారం ధరలను ఒకసారి పరిశీలిస్తే

హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 46,300 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,500కి చేరింది.
ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,210 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,210కి చేరింది.
విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ. 44,150 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 48,170కి చేరింది.
చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,650కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 48,710కి చేరింది.

వెండి ధరలు

వెండి ధర నిన్న భారీగా తగ్గింది. గత 10 రోజుల్లో వెండి ధర రూ.6200 తగ్గింది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.61.70 ఉంది. 10 గ్రాముల వెండి ధర రూ.617 ఉంది. కేజీ వెండి ధర రూ.61,700 ఉంది. శనివారం కేజీ వెండి ధర రూ.5,300 తగ్గింది. గడిచిన మూడు నెలల్లో వెండి ధర భారీగా తగ్గింది. జూన్ 1న రూ.76,800 ఉన్న వెండి ధర.. ఇప్పుడు రూ.61,700 ఉంది.