Gold Rates : మళ్లీ పెరిగిన బంగారం.. ఈరోజు ఎంతంటే?

పండుగ సీజన్ వచ్చేసింది.. బంగారం అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గతవారం నుంచే బంగారం ధర క్రమంగా పెరుగుతోంది.

Gold rates today in Hyderabad : పండుగ సీజన్ వచ్చేసింది.. బంగారం అమ్మకాలకు డిమాండ్ పెరిగిపోయింది. బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గతవారం నుంచే బంగారం ధర క్రమంగా పెరుగుతోంది. బుధవారం (అక్టోబర్ 6) స్వల్పంగా తగ్గిన బంగారం గురువారం (అక్టోబర్ 7) రోజున ఒక్కసారిగా పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీ బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర పెరిగింది.. 10 గ్రాముల బంగారం ధర రూ.46,604 నుంచి రూ.46,885కు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర రూ.220 వరకు పెరిగింది.
Girl for Girl custome : పెళ్లి పేరుతో అమానుషాలు :ఆటా-సాటా,ఝగడా,నాత్రా సంప్రదాయాలు పేరుతో అరాచకాలు

10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈ రోజు రూ.47,780కు చేరింది. అలాగే `10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. దాంతో బంగారం ధర రూ.43,800కు చేరింది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర సుమారు రూ.250 పైగా పెరిగింది. దాంతో బంగారం ధర కాస్తా రూ.42,947 చేరింది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా అమాంతం పెరిగాయి. కేజీ వెండి ధర రూ.500కి పైగా పెరిగింది. దాంతో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.61,078కు చేరుకుంది.

చెన్నైలో ఈ రోజు బంగారం ధర 22 క్యారెట్లు రూ.44,110 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధరరూ.48,120 వరకు ఉంది. ముంబైలో రూ.45,900 (22క్యారెట్లు), రూ.46,900 (22 క్యారెట్లు) వరకు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.43,800గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,780 పలుకుతోంది.  వెండి, బంగారం ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధరల్లో మార్పుతో మారుతుంటాయి. కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాల ఆధారంగా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గుదల కొనసాగుతుంటుంది.
Kajal Aggarwal : ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్ కమింగ్ సూన్?

ట్రెండింగ్ వార్తలు