Gold Buying : గోల్డ్ కొనొద్దనడం ఎందుకు? గోల్డ్ షాపులు మూసేయొచ్చు కదా? అనే డౌట్ మీకూ ఉందా?

Gold Buying : బంగారం షాపులు మూసేయడం అనేది సరైన చర్య కాదు. దీని వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతుంది. సహజంగానే బంగారం కొనొద్దు అంటే భయపడి ఇంకా ఎక్కువగా కొనే భారతీయ సమాజంలో అసలు బంగారం షాపులు మూసేస్తున్నారని తెలిస్తే ఏకంగా ఇంకా ఎక్కువ కొంటారు. దీని వల్ల లేనిపోని భయాలు మొదలవుతాయి. కాబట్టి, ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు.

Gold shops

PM Modi key statement on gold : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గోల్డ్ కొనొద్దని ప్రకటించారు. అత్యవసరం అయితే తప్ప బంగారం జోలికి వెళ్లొద్దని సూచించారు. దీని వల్ల విదేశీ మారక నిల్వలు మిగులుతాయని.. వాటిని ఇతర వస్తువులు (క్రూడ్ ఆయిల్ లాంటివి) కొనడానికి ఉపయోగపడతాయని చెప్పారు. అయితే, దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జోక్స్ కూడా వచ్చాయి. అసలు గోల్డ్ దిగుమతులు ఆపేయొచ్చు కదా? గోల్డ్ షాపులు మూసేస్తే ఎవరూ కొనరు కదా? అని చాలా మంది సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.

Also Read : Gold silver Rate Today : బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు.. నేడు ఏపీ, తెలంగాణలో ధరలు ఇవే..

బంగారం షాపులు మూసేయడం అనేది సరైన చర్య కాదు. దీని వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరుగుతుంది. సహజంగానే బంగారం కొనొద్దు అంటే భయపడి ఇంకా ఎక్కువగా కొనే భారతీయ సమాజంలో అసలు బంగారం షాపులు మూసేస్తున్నారని తెలిస్తే ఏకంగా ఇంకా ఎక్కువ కొంటారు. దీని వల్ల లేనిపోని భయాలు మొదలవుతాయి. కాబట్టి, ఆ రకంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవు.

బంగారం దుకాణాలకు నష్టాలు..
బంగారం వ్యాపారం చేసే వాళ్లు కేవలం కొత్త బంగారంతోనే వ్యాపారం చేయరు. పాత బంగారాన్ని తీసుకుని కరిగించి కొత్త డిజైన్స్ తో కూడా చేయిస్తారు. బంగారం షాపులు మూసేస్తే అలాంటివి కూడా చేయడం కుదరదు. దీంతోపాటు అందరూ 22 క్యారెట్ల బంగారమే చేయించడం లేదు. చాలా మంది లైట్ వెయిట్ గోల్డ్ జ్యూయలరీ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే 20 క్యారెట్, 18 క్యారెట్ బంగారం అన్నమాట. బంగారం శాతం తగ్గించి జ్యూయలరీ చేయించుకుంటున్నారు. అసలు షాపులు మూసేస్తే అలాంటివి కూడా చేయలేరు.

గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగే అవకాశం..
బంగారం షాపులు మూసేస్తే గోల్డ్ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుంది. 1980ల్లో గోల్డ్ ఇంపోర్ట్ డ్యూటీలు పెరిగినప్పుడే దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ లాంటి వారు పుట్టుకొచ్చి బంగారం స్మగ్లింగ్ నెట్ వర్క్ ని ఏర్పాటు చేశారు. మళ్లీ అలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీంతోపాటు వ్యాపారులు కూడా అడ్డదారిలో విక్రయాలు జరిపే అవకాశాలు ఉంటాయి. ఉదాహరణకు 2016 నవంబర్ 8న నోట్ల రద్దు చేసినప్పుడు చాలా మంది పాత నోట్లతో బంగారం కొన్నారు. వాటికి పాత డేట్లు వేశారనే ఆరోపణలతో చాలా బంగారం షాపుల మీద రైడ్స్ కూడా జరిగాయి.

ఇవన్నీ ఆలోచించిన తర్వాతే ప్రభుత్వాలు కొనొద్దని సూచిస్తాయి కానీ మొత్తానికి గోల్డ్ ఇంపోర్ట్స్ బ్యాన్ చేయడం లేకపోతే బంగారం షాపులు మూసేయడం లాంటి పనులు చేయవు.