కవిత్వం అంటే మగవాళ్లు మాత్రమే రాసేది అని అనుకునే రోజుల్లో కవిత్వం రాయడమే కాక స్త్రీ వాద కవిత్వానికి ప్రాచుర్యం కలిపించిన బెంగాలీ కవయిత్రి కామిని రాయ్. ఇవాళ(అక్టోబర్12) ఆమె 155వ జయంతి.
బెంగాలీ కవయిత్రిగా, స్త్రీవాద కవిత్వంతో ఎందరో మహిళలను ఉత్తేజం చేసి, ఎందరికో స్పూర్తి నింపిన కామిని రాయ్ జయంతి సందర్భంగా గూగుల్ తన డూడిల్ ని మర్చుకుంది. ఆమె జ్ఞాపకార్ధంగా ప్రత్యేకంగా ఆమె ఫోటోను పెట్టి నివాళి అర్పించింది. అక్టోబర్12, 1864న బెంగాల్ లోని బెసాండా ప్రాంతంలో కామిని రాయ్ జన్మిచారు. ప్రతి ఒక్కరికి మార్గదర్శకురాలుగా ఉండే ఆమెకి ప్రతీ విషయంపైన పరిజ్ఞానం ఉంది.
బ్రిటిష్ కాలంలోనే విద్యానభ్యసించిన మెుట్ట మెుదటి మహిళ కామిని రాయ్. ఆమె బీఏ ఆనర్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన మెుదటి భారతీయ మహిళ. అంతేకాకుండా భారతీయ స్త్రీవాదుల్లలో ఒకరిగా గుర్తిస్తారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తరువాత టీచర్ గా పని చేశారు.‘అలయ్ ఓ ఛాయ్’ అనే బుక్ ను 1889లో ప్రచురించారు.
బంగియా నారీ సమాజాన్ని స్ధాపించి, అందులో ఒక సభ్యురాలుగా ఉన్నారు. ‘మహిళలు ఇంటికి ఎందుకు పరిమితం కావాలి మరియు సమాజంలో మంచి స్ధానం కల్పించాలి ’అనే బుక్ ని 1924లో రాశారు. ఆమెకు కొల్‌కత్తా యూనివర్సీటీ 1929లో జగత్తారిని మెడల్‌ను ప్రదానం చేసింది.