సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ గత ఏడాది డిసెంబర్‌లో తన గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. చెప్పినట్లుగానే గూగుల్ ఇకపై గూగుల్ ప్లస్ సేవలను నిలిపివేయనుంది.
2019, ఏప్రిల్ 2వ తేదీ నుంచి గూగుల్ ప్లస్ ఇక పనిచేయదు. అలాగే యూజర్లకు చెందిన గూగుల్ ప్లస్ అకౌంట్లు, వారు క్రియేట్ చేసిన పేజీలు, అందులో ఉండే కంటెంట్‌ను కూడా గూగుల్ డిలీట్ చేయనుంది. కానీ తమ సమాచారం కావాలనుకున్న వారు గూగుల్ ప్లస్‌లో నుంచి ఆ డేటాను డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని గూగుల్ అందిస్తున్నది. కాకపోతే ఏప్రిల్ 2వ తేదీ వరకు మాత్రమే అందుకు అవకాశం ఉంటుంది. అయితే గూగుల్ ఫొటోస్ లో బ్యాకప్ అయి ఉన్న ఫొటోలు, వీడియోలు మాత్రం డిలీట్ అవ్వవని గూగుల్ తెలిపింది.