తల్లి పాల బలం : కరోనాను జయించిన 3 నెలల బాలుడు

  • Publish Date - April 29, 2020 / 09:55 AM IST

కరోనా వైరస్ కారణంగా కొంతమంది బలవతుండగా..మరికొంత మంది దీని నుంచి బయటపడుతున్నారు, చిన్న పిల్లల నుంచి మొదలుకుని…వృద్ధుల వరకు ఇందులో ఉన్నారు. 100 సంవత్సరాలు దాటిన వారు కూడా కరోనాను జయించారు. తాజాగా మూడు నెలల బాలుడు ఈ జాబితాలో చేరారు. ఎలాంటి మందులు లేకుండానే..కోలుకున్నాడని వైద్యులు వెల్లడించారు. ఆరోగ్యంగా ఉండడంతో బాలుడి కుటుంబసభ్యులు, వైద్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్ పూర్ లో నివాసం ఉంటున్న ఓ కుటుంబానికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇక్కడ తల్లికి పాజిటివ్ రాగా..మూడు నెలల బాలుడికి పాజిటివ్ వచ్చింది. దీంతో కుటుంబసభ్యులు తల్లడిల్లిపోయారు. బాలుడికి చికిత్స ఎలా చేయాలనే దానిపై వైద్యులు తర్జనభర్జనలు పడ్డారు. బాలుడికి పాలిచ్చే సమయంలో గ్లవ్స్, మాస్క్ ధరించాలని తల్లికి సూచించడం జరిగిందని, ఆమె అలాగే చేసిందని BRD మెడికల్ కాలేజీ ప్రిన్స్ పాల్ గణేష్ కుమార్ వెల్లడించారు. 

కరోనా వైరస్ సోకిన తర్వాత..బాలుడికి కేవలం జ్వరం మాత్రమే వచ్చిందని, ఎలాంటి తీవ్రమైన సమస్యలు రాలేదన్నారు. ఎలాంటి చికిత్సలు లేకుండానే..తల్లిపాలతో రోగ నిరోధక శక్తి పెంచుకని బాలుడు బయటపడ్డాడని వెల్లడించారు. 2020, ఏప్రిల్ 25, 26వ తేదీల్లో తల్లికి, బాలుడికి పరీక్షలు నిర్వహించామన్నారు. నెగటివ్ రావడంతో..వీరిని డిశ్చార్జ్ చేయడం జరిగిందన్నారు.