Banks Privatisation: మరో రెండు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటైజేషన్ దిశగా..

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది.

Banks Privatisation: రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల (పిఎస్‌బి) ప్రైవేటీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2021-22 కేంద్ర బడ్జెట్‌లో, ప్రభుత్వం సంవత్సరం కాలంలోనే రెండు PSBల ప్రైవేటీకరణను చేపట్టాలనే ఉద్దేశాన్ని ప్రకటించింది. ప్రభుత్వ రంగ సంస్థలలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని ఆమోదించింది.

BPCL ఉపసంహరణ కూడా ఉందని దీనికి సంబంధించి తాజాగా బిడ్‌లను ఆహ్వానించనున్నట్లు వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL)లో మొత్తం 52.98 శాతం వాటాను విక్రయించాలని ప్రణాళిక వేసింది. బిడ్డర్ల నుంచి 2020 మార్చిలో ఆసక్తి ఉన్నవారికి ఆహ్వానం ఇచ్చింది. నవంబర్ 2020 నాటికి కనీసం 3 బిడ్‌లు వచ్చాయి.

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యూహాత్మక విక్రయంపై సమస్యలున్నాయని, వాటి పరిష్కరించిన తర్వాతే ప్రక్రియ చేపట్టనున్నట్లు వర్గాలు వెల్లడించాయి.

Read Also: ప్రైవేటీకరణపై కేసీఆర్ సమరశంఖం..!

ప్రభుత్వ థింక్-ట్యాంక్ నీతి అయోగ్ ప్రైవేటీకరణ కోసం డిజిన్వెస్ట్‌మెంట్‌పై కోర్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీలకు రెండు బ్యాంకులు, ఒక బీమా కంపెనీని ఇప్పటికే సూచించింది. అందిన సమాచారం ప్రకారం.. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వం వ్యూహరచన చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు