Mehbooba Mufti: కశ్మీరీ పండిట్లను రాజకీయం కోసం వాడుకుంటున్నారు.. కేంద్రంపై మెహబూబా ముఫ్తీ ఆరోపణలు

జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కశ్మీర్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు

Mehbooba Mufti: జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్‭లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ కశ్మీర్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లోయలో శాంతి సమకూరుతుందని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే రాష్ట్ర ప్రత్యేక ప్రతిపత్తి రద్దు అనంతరం పరిస్థితులు మరింత విషమంగా మారాయని ఆమె దుయ్యబట్టారు.

Maharashtra: మంత్రివర్గ విస్తరణ మరోసారి వాయిదా.. ఇప్పట్లో విస్తరణ లేనట్టేనట!

‘‘కశ్మీరీ పండట్లకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పిస్తుందో ప్రజలకు చెప్పాలి. వాస్తవానికి వారికి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఏమీ లేవు. వారిని కేవలం రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. లోయలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఆర్టికల్ 370 రద్దు సమయంలో ప్రభుత్వం చేసిన హామీలు అన్నీ నీటిపాలయ్యాయి. అంతకు ముందు కంటే ఇప్పుడు పరిస్థితులు మరింత విషమించాయి. వాటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి’’ అని ముఫ్తీ అన్నారు.

Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

ట్రెండింగ్ వార్తలు