జనగణన : కేంద్రం కీలక ఆదేశాలు

2021లో జనాభా గణన ప్రారంభం కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా జనాభా గణనకు సంబంధించి కేంద్రం పలు నిబంధనలు మార్చింది. వీటిపై ఓ పక్క విపక్షాలు

  • Publish Date - January 30, 2020 / 12:52 PM IST

2021లో జనాభా గణన ప్రారంభం కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా జనాభా గణనకు సంబంధించి కేంద్రం పలు నిబంధనలు మార్చింది. వీటిపై ఓ పక్క విపక్షాలు

2021లో జనాభా గణన ప్రారంభం కానుంది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. కాగా జనాభా గణనకు సంబంధించి కేంద్రం పలు నిబంధనలు మార్చింది. వీటిపై ఓ పక్క విపక్షాలు ఆందోళన చేస్తున్నా.. కేంద్రం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. తాజాగా కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది.

2021 జనగణన కార్యక్రమంలో భాగంగా గృహాల వివరాలను కూడా మదింపు చేయాలని అధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 2021 నుంచి చేపట్టే జనగణలో భాగంగా 2020 ఏప్రిల్ 1 తేదీ నుంచి సెప్టెంబర్ 30 తేదీ వరకు దీనికి సంబంధించిన వివరాలను గుర్తించాలని రాష్ట్రాల సెన్సెస్ అధికారులకు సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ.

జనగణనలో భాగంగా గృహాలకు సంబంధించి 31 అంశాలను నమోదు చేయాలని స్పష్టం చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్రం. ప్రతి ఇంటి నుంచి వివరాలను సేకరించి నమోదు చేయాలని జనగణన విభాగం స్పష్టం చేసింది. మొదటి 5 ప్రశ్నలు ఇంటికి సంబంధించిన వివరాలతో పాటు మరో రెండు ప్రశ్నలు గృహస్తుకు సంబంధించి వివరాలను సేకరిస్తూ ప్రశ్నావళి రూపొందించారు. అలాగే 20 ప్రశ్నలు ఇంటిలోని వివిధ మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రశ్నలుగా పేర్కొన్నారు. మరో ఆరు ప్రశ్నలు వ్యక్తిగత ఆస్తులు, వాహనాలకు సంబంధించిన అంశాలపై వివరాలను నమోదు చేయాల్సిందిగా సూచనలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. జనగణనకు సంబంధించి విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం అవేమీ పట్టించుకోవడం లేదు. తాను అనుకున్నది చేసుకుంటూ పోతోంది.