Green paint on Kalaburagi railway station in Karnataka draws ire of pro-Hindu groups
Kalaburagi Railway Station: కర్నాటక రాష్ట్రంలోని కలబురగి రైల్వే స్టేషన్కు ఆకుపచ్చ రంగు వేయడంపై హిందూ అనుకూల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయమై మంగళవారం ఉదయం రైల్వే స్టేషన్ ఎదుట హిందూ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ఆకుపచ్చ రంగు వేయడం వల్ల కలబురగి రైల్వే స్టేషన్ మసీదులా ఉందంటూ వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కలబురగి రైల్వేస్టేషనుకు వేసిన ఆకుపచ్చ రంగును వెంటనే తొలగించి వేరే రంగు వేయాలని డిమాండ్ చేశారు. రైల్వే స్టేషన్ ముందు హిందూ సంఘాల కార్యకర్తల నిరసనతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చెన్నై-ముంబై మార్గంలో ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లలో కలబురగి రైల్వే స్టేషన్ ఒకటి. అలాగే చెన్నై-ముంబై-హైదరాబాద్ మూడు మార్గాల మధ్యలో ఉంది. రోజూ వేలాది మంది ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అయితే మంగళవారం హిందూ సంఘాల నిరసనతో ప్రయాణికులకు కాస్త ఇబ్బంది ఎదురైనట్లు స్టేషన్ వర్గాలు వెల్లడించాయి.
Bihar: సీఎం కుర్చీని తేజస్వీ యాదవ్కు వదిలేసిన నితీశ్ కుమార్.. అలా అని తాను పీఎం రేసులో కూడా లేరట