Wedding Hall
Wedding Hall: కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు పారిపోయాడు. దీంతో ఆ వధువుకి పెళ్ళికి వచ్చిన యువకుడితో పెళ్లి చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ పట్టణంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. సంప్రదాయం ప్రకారం వధూవరులు దండలు మార్చుకోవడం ముగిసింది. మరికొద్ది సేపట్లో పెళ్లి మండపం ఎక్కాల్సి ఉంది. ఈ సమయంలోనే వరుడు కనిపించకుండా పోయాడు.
వరుడి కోసం ఇరు కుటుంబాలు తీవ్రంగా గాలించాయి.. ఎంతకీ దొరకలేదు మరోవైపు ముహూర్తం సమయం దగ్గరపడుతోంది. పెళ్ళికి దగ్గరి బంధువులు అందరు వచ్చారు. ఇటువంటి పరిస్థితిల్లో పెళ్లి కొడుకు పారిపోయి పెళ్లి క్యాన్సల్ అయింది అంటే తమ పేరు ప్రతిష్టతలకు భంగం కలుగుతుందని ఆలోచించిన వధువు తల్లిదండ్రులు.. పెళ్ళికి వచ్చిన వారిలో ఎవరైనా పెళ్ళికి సిద్ధంగా ఉన్నారేమో అని తెలుసుకున్నారు. ఓ యువకుడికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలుసుకున్నారు.
ఆ యువకుడిని పిలిచి తమ కూతురిని చేసుకోవాలని వేడుకున్నారు. మొదట యువకుడు కుదరదని చెప్పాడు. తర్వాత యువకుడి తల్లిదండ్రులు చేసుకోవాలని సూచించడంతో పెళ్లిమండపంపైకి ఎక్కి పెళ్ళితంతు ముగించారు. ఇక తమ కూతురిని పెళ్లాడకుండా వెళ్ళిపోయిన వరుడి కుటుంబంపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.