Selfie With Tiger: అరె బాబూ.. పులితో ఆటలా.. జర జాగ్రత్త.. పులితో సెల్ఫీలు దిగేందుకు యువకులు యత్నం.. వీడియో వైరల్..

అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. దాని దగ్గరగా వెళ్లి మరీ సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రయత్నించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు యువకుల తీరును తప్పుబడుతున్నారు.

Selfie With Tiger

Selfie With Tiger: అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న పులిని ఫొటోలు తీసేందుకు నలుగురు యువకులు ప్రయత్నించారు. దాని దగ్గరగా వెళ్లి మరీ సెల్ఫీలు తీసుకొనేందుకు ప్రయత్నించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా ట్విటర్ లో పోస్టు చేశాడు. అయితే నెటిజన్లు మాత్రం యువకుల తీరుపై మండిపడుతున్నారు. అరె బాబూ.. పులితో ఆటలా.. జర జాగ్రత్త అంటూ.. హెచ్చరికగా కామెంట్లు చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ వీడియోను సుశాంత్ నంద గతవారం ట్విటర్ లో పోస్టు చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 80వేలకుపైగా మంది ఈ వీడియోను వీక్షించగా,, 3వేల మంది కంటే ఎక్కువగా లైక్ చేశారు. పలువురు నెటిజన్లు యువకులను హెచ్చరిస్తూ రీట్వీట్లు చేశారు. ఈ వీడియో ఏ ప్రాంతానిదో పేర్కొనలేదు. అయితే ఈ వీడియోలో నలుగురు వ్యక్తులు అటవీ ప్రాంతంలో రహదారిపై ఉన్నారు. అడవిలో నుంచి పులి నెమ్మదిగా వచ్చి రోడ్డుదాటడాన్ని మనం చూడొచ్చు.

పులి రోడ్డును దాటుతున్న క్రమంలో యువకులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేశారు. అడవిలో నుంచి పులి వస్తున్న క్రమంలో ఫొటోలు తీయడం ప్రారంభించిన వారు రోడ్డు దాటుతున్న క్రమంలో దాని దగ్గరగా వెళ్లి ఫొటోలు తీసుకొనేందుకు ప్రయత్నించారు. అయితే అదృష్టవ శాత్తూ ఆ పులి వారిని పట్టించుకోకుండా రోడ్డు దాటి వెళ్లిపోయింది. సుశాంత్ నంద ఈ యువకుల ప్రయత్నాన్ని తప్పుబట్టారు. దయచేసి ఇలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకండి అంటూ సుశాంత్ నంద తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు యువకుల తీరును తప్పుబడుతూ రీట్వీట్లు చేశారు.