ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి గడుపుతున్నారు. కాగా లాక్ డౌన్ కపుల్స్ కు వరంగా మారిందని చెప్పాలి. వాళ్లు లాక్ డౌన్ సమయాన్ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎక్కువ సేపు బెడ్ రూమ్ లో గడిపేందుకు జంటలు ఆసక్తి చూపుతున్నాయట. ఇలా చెప్పడానికి కారణం లేకపోలేదు. గతంలో పోలిస్తే లాక్ డౌన్ సమయంలో కండోమ్స్, ఐ-పిల్స్(గర్భనిరోధక మాత్రలు) అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.
ఆసక్తికర అంశాలు బయటపెట్టిన డుంజో యాప్:
లాక్ డౌన్ కారణంగా అన్ని రకాల షాపులు మూతబడ్డాయి. నిత్యావసరాల షాపులు, మందుల షాపులకు మాత్రం మినహాయింపు నిచ్చారు. అయితే లాక్‌డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని డోర్ డెలివరీ చేసేందుకు పలు యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఆహారం, మందులతో పాటు నిత్యావసరాలను కూడా డోర్ డెలివరీ చేస్తున్నాయి. కాగా కిరాణ సామాగ్రి నుంచి ఆహారం వరకు అన్నింటినీ క్షణాల్లో తెచ్చి పట్టే యాప్ ‘డుంజో’(Dunzo). ఇది హైదరాబాద్ కన్నా ముంబై, చెన్నై నగరాల్లో బాగా పాపులర్ అయిన యాప్.
హ్యాండ్‌వాష్‌ను ఎక్కువగా ఆర్డర్ చేసిన చెన్నై, జైపూర్ వాసులు:
మార్చి నెలలో జనాలు ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని డుంజో తెలిపింది. ఇందులో ఆసక్తికర అంశాలు బయటపెట్టింది. దీని ప్రకారం చెన్నై, జైపూర్ వాసులు హ్యాండ్‌వాష్‌ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు.
ముంబైలో కండోమ్స్, హైదరాబాద్ లో ఐ-పిల్స్ ఎక్కువగా ఆర్డర్:
అన్నింటికన్నా భిన్నంగా ముంబై వాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉంది. ఇక మన హైదరాబాద్ విషయానికొస్తే మన భాగ్యనగర వాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారట. ఏంటి షాక్ అయ్యారా? కానీ ఇది నిజం అంటోంది డుంజో. లాక్ డౌన్ కావడంతో జనాలంతా ఇళ్లలోనే ఉండిపోయారు. ఇది కపుల్స్ కు బాగా కలిసొచ్చింది. వారికి కావాల్సినంత ఏకాంత సమయం దొరికినట్టు అయ్యింది. కండోమ్స్, ఐపిల్స్ విచ్చలవిడిగా వాడేయటానికి ఇదే కారణమై ఉండొచ్చని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, పుణె, బెంగళూరులో ప్రెగ్నన్సీ కిట్స్, ఐ పిల్స్ తెగ వాడేశారని డింజో యాప్ తెలిపింది.
లాక్ డౌన్ ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కపుల్స్:
లాక్ డౌన్ చాన్స్ ని ముంబై వాసులు బాగా ఎంజాయ్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కండోమ్స్ సేల్స్ విపరీతంగా పెరగడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. లాక్ డౌన్ పుణ్యమా అని దంపతులు మరింత దగ్గర కావడానికి ఆస్కారం ఏర్పడింది. దీంతో కపుల్స్ రెచ్చిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎక్కువ సేపు బెడ్ రూమ్ లో గడిపేస్తున్నారట. అయితే గర్భం రాకుండా ముందు జాగ్రత్తగా కండోమ్స్, పిల్స్ వాడుతున్నారట.
Some Indian cities med the most of it during the lockdown, this March. Delivering from pharmacies is clearly no child’s play.?#Contraceptives #Condoms #PregancyKits #HandWash #IPill #Pharmacies #Medicines #Lockdown2020 #quarantinelife #quarantineandchill pic.twitter.com/6fEvKMJniC
— Dunzo (@DunzoIt) April 14, 2020