స్కూల్, కాలేజీ పాఠ్యాంశాల్లో భగవద్గీత తప్పనిసరి చేయాలి : బీజేపీ ఎంపీ

  • Publish Date - December 12, 2019 / 05:32 AM IST

స్కూల్స్, కాలేజీల్లో పాఠ్యాంశాల్లో భగవద్గీతను తప్పనిసరి చేయాలని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ బుధవారం (డిసెంబర్ 11)న లోక్ సభలో వ్యాఖ్యానించారు. భగవద్గీతను తప్పనిసరి చేసేలా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ సూచించారు.

మహాత్మాగాంధీ కూడా భగవద్గీతను ఎంతగాను ఫాలో అయ్యేవారనీ.. ఆయనకు ఏమన్నా సమస్యలు వస్తే..భగవద్గీత చదువుకుని సమస్యలకు పరిష్కారంగా ‘గీత’నే అనుసరించారని ఎంపీ అరవింద్ అన్నారు. జీరో అవర్ సమయంలో దిగువ సభలో మాట్లాడిన సందర్భంగా ఈ సూచనలు చేశారు. మనకుండే అన్ని సందేహాలకు.. సమస్యలకు భగవద్గీతలో అన్నింటికి సమాధానాలు లభిస్తాయని అన్నారు.

పలు అంతర్జాతీయ విద్యాసంస్థల్లో కూడా గీతను బోధిస్తున్నారనీ ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. నేటి పిల్లలు.. యువత భగవద్గీతను చదివితే వారికి వచ్చే సందేహాలకు.. సమస్యలకు ఇట్లే పరిష్కారాలు లభిస్తాయని బీజేపీ ఎంపీ అరవింద్ శర్మ సూచించారు.

ట్రెండింగ్ వార్తలు