40 గ్రాముల బంగారం మింగేసిన ఎద్దు.. పేడ కోసం మహిళ ఎదురుచూపులు

  • Publish Date - October 30, 2019 / 05:59 AM IST

హర్యానాలోని కలనవాలి ఏరియాలో నివసిస్తున్న ఓ మహిళకు చెందిన 40 గ్రాముల బంగారు ఆభరణాలను ఒక ఎద్దు తినేసింది. అదేంటి అనుకుంటున్నారా..? మీరు విన్నది అక్షరాలా నిజం. అసలు విషయమేంటో తెలుసుకుందామా!

వివరాలు.. హర్యానాలోని కలనవాలి లో ఓ మహిళా తన 40 గ్రాముల బంగారాన్ని ఓ గిన్నెలో వేసింది. అనంతరం కూరగాయలు కట్‌ చేస్తూ.. మిగిలిన చెత్తను బంగారు ఆభరణాలు ఉన్న గిన్నెలో వేసింది. ఆ తర్వాత గిన్నెలో బంగారం ఉన్న విషయాన్ని మర్చిపోయి ఆ చెత్తను తీసుకుపోయి.. ఇంటికి సమీపంలో ఉన్న చెత్తకుండీలో పడేసింది. అప్పుడే అక్కడికి వచ్చిన ఓ ఎద్దు ఆ కూరగాయల చెత్తతో పాటు బంగారు ఆభరణాలను కూడా మింగేసింది. 

ఆ మహిళకు తన బంగారం పోయిందని తర్వాత గుర్తువచ్చింది.. వెంటనే ఇంటి వద్ద సీసీ కెమెరాలను పరిశీలించింది. ఆమె పడేసిన చెత్తను ఎద్దు తిన్నట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. దీంతో బాధితురాలు ఆ ఎద్దును పట్టుకుని ఇంటిముందు కట్టేసింది. మింగేసిన బంగారం.. పేడలోనైనా వస్తుందేమోనని ఎద్దుకు బాగా తిండిపెడుతున్నారు. అంతేకాదు ఒక వేళ పేడలో కనుక ఆ బంగారం రాకపోతే.. ఈ ఎద్దును గోశాలకు తరలిస్తామని చెప్పింది.