ముహూర్తం ఫిక్స్ : 27న సీఎంగా ప్రమాణస్వీకారం

హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై... మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎన్నుకుంది. సీఎంగా ఆయన

  • Publish Date - October 26, 2019 / 09:45 AM IST

హర్యానాలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. బీజేపీ శాసనసభా పక్షం సమావేశమై… మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎన్నుకుంది. సీఎంగా ఆయన

హర్యానాలో మళ్లీ అధికార పగ్గాలు చేపట్టబోతున్న బీజేపీ.. శాసనసభా పక్షం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మరోసారి తమ నేతగా మనోహర్ లాల్ ఖట్టర్‌ను బీజేఎల్పీ ఎన్నుకుంది. దీంతో సీఎంగా రెండోసారి కట్టర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 27న సీఎంగా ఖట్టర్ ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. గవర్నర్ ని కలుస్తామని బీజేపీ-జేజేపీ ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని కోరతామన్నారు.

బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన ఖట్టర్ కి ఆ పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. పార్టీ ఆఫీస్ లో సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మిఠాయి తినిపించారు.

డిప్యూటీ సీఎం పదవిని జేజేపీకి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షాతో… జేజేపీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా సమావేశం అయిన తర్వాత రెండు పార్టీలు కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. దుష్యంత్ సింగ్‌‌కి డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నారు. సీఎంగా మనోహర్ లాల్ ఖట్టర్ రెండోసారి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు జేజేపీ చీఫ్ దుష్యంత్ సింగ్ తెలిపారు.

హర్యానాలో బీజేపీ, జేజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటవుతున్న విషయం తెలిసిందే. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో జేజేపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అసెంబ్లీలో బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 మంది ఎమ్మెల్యేల బలం అవసరం.

90 స్థానాలున్న హర్యానా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 40 సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు, దుష్యంత్ సింగ్ చౌతాలా నేతృత్వంలోని జన్‌నాయక్ జనతా పార్టీ (జేజేపీ)కి 10 సీట్లు వచ్చాయి. ఇండిపెండెంట్లు, ఇతరులు మిగతా 10 సీట్లు గెలిచారు. తాము బీజేపీకి మద్దతిస్తామంటూ స్వతంత్ర అభ్యర్థులు ప్రకటించారు. వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భావించారు. అయితే, ఇండిపెండెంట్ల కంటే ఒకే పార్టీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ మొగ్గుచూపింది.

Chandigarh: Manohar Lal Khattar has been elected BJP’s legislative party leader. #Haryana pic.twitter.com/R1DPhZTKvL