Anil
Only Vaccinated People : దేశానికి కరోనా మూడో ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు వెలువడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారి విషయంలో పలు రాష్ట్రాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తాజాగా హర్యానా ప్రభుత్వం.. జనవరి-1,2022 నుంచి రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోని వారు బహిరంగ ప్రదేశాల్లో తిరగటంపై నిషేధం విధించింది.
కళ్యాణ మండపాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు లేదా మరే ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి వ్యాక్సిన్ తీసుకోని వారికి అనుమతి ఉండబోదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ బుధవారం తెలిపారు. ఒమిక్రాన్, కరోనా మూడవ వేవ్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికే ఈ నిబంధన అని చెప్పారు. హర్యాణాలో ఇప్పటివరకు ఒమిక్రాన్ వేరియంట్ వెలుగుచూడలేదు. అయినప్పటికీ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధిస్తోంది. ఆ రాష్ట్రంలో ఇప్పటివరకు 3 కోట్ల 11 లక్షల టీకా డోసులు పంపిణీ జరిగింది.
మరోవైపు,వ్యాక్సిన్ తీసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని పంజాబ్ ప్రభుత్వం బుధవారం స్పష్టం చేసింది.
ALSO READ Women CRPF Personnel : సోనియా,ప్రియాంక భద్రతకు సీఆర్పీఎఫ్ మహిళా కమాండోలు