COVID-19 Relaxation: కొవిడ్ నిబంధనలు సడలించిన హర్యానా.. బార్లు, మాల్స్ రీ ఓపెన్

Haryana Relaxes Covid 19 Curbs

COVID-19 Relaxation: హర్యానా ప్రభుత్వం కొవిడ్ నిబంధనలు సడలిస్తూ జూన్ 6న అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. దాంతో పాటు మాల్స్ టైమింగ్స్ కూడా పొడిగించింది. మహమ్మారి అలర్ట్- సురక్షిత్ హర్యానా డ్రైవ్ ను జూన్ 14వరకూ పొడిగించి రిలాక్సేషన్లను కాస్త పెంచింది.

కేసు లోడ్ తగ్గడంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్డర్ రివైజ్ చేసిన ప్రభుత్వం మార్కెట్ షాపులు కూడా రీ ఓపెన్ చేయాలని నిర్ణయించింది. కాకపోతే కేవలం 9గంటల పాటు మాత్రమే ఓపెన్ చేయాలని అది కూడా రోజు విడిచి రోజు తెరిచి ఉంచాలని ఆదేశించింది.

విడిగా ఉండే షాపులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకూ తెరవాలని సరి బేసి విధానాల ద్వారా నిర్వహించాలని సూచించింది. మాల్స్ ప్రస్తుతం ఉదయం 10 నుంచి రాత్రి 8గంటల వరకూ ఓపెన్ చేయవచ్చని అనుమతులిచ్చారు. అంతకుముందు కేవలం సాయంత్రం 6గంటల వరకూ మాత్రమే ఓపెన్ ఉండేవి.

రెస్టారెంట్లు, బార్లు ఉదయం 10గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఓపెన్ ఉండొచ్చు. అది కూడా 50శాతం సీటింగ్ కెపాసిటీతో సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ నిర్వహించాలి. హోటల్స్, రెస్టారెంట్ల నుంచి హోం డెలివరీ చేయడానికి రాత్రి 10గంటల వరకే అనుమతులు ఉన్నాయి.

మతపరమైన ప్రదేశాలు కూడా రీఓపెన్ చేయొచ్చని.. 21మందికి మించి లోపలికి అనుమతించొద్దని ఆదేశించారు. అది కూడా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ, శానిటైజ్ చేసుకుంటూనే ఫాలో అవ్వాలని ఆదేశించారు. పెళ్లిళ్లు, అంత్యక్రియలకు సైతం 21మందిని, కార్పొరేట్ ఆఫీసుల్లోనూ 50శాతం స్టాఫ్ ను అనుమతించారు.