Mamata Banerjee: పోలీస్ క్వార్టర్స్ అనుకుని మమతా బెనర్జీ ఇంటి గోడ దూకేశాడట

సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి సీఎం మమతా బెనర్జీ ఇంటి గోడ దూకేశాడు. చివరికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి తాను కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అనుకుని ఇలా చేశానంటూ సీనియర్ పోలీస్ అధికారికి చెప్పాడట.

 

 

Mamata Banerjee: సెక్యూరిటీ గార్డుల కళ్లుగప్పి సీఎం మమతా బెనర్జీ ఇంటి గోడ దూకేశాడు. చివరికి సెక్యూరిటీగా ఉన్న పోలీసులకు దొరికిపోయిన ఆ వ్యక్తి తాను కోల్‌కతా పోలీస్ హెడ్‌క్వార్టర్స్ అనుకుని ఇలా చేశానంటూ సీనియర్ పోలీస్ అధికారికి చెప్పాడట. 30ఏళ్ల వయస్సున్న హపీజుల్ మొల్లా అనే వ్యక్తి వెస్ట్ బెంగాల్ నార్త్ 24పరగణాస్ జిల్లాలోని హస్నాబాద్ కు చెందిన వాడు.

ఆదివారం రాత్రి ఒంటి గంట 20నిమిషాలకు కలీఘాట్ ఏరియాలోని 34B హరీశ్ చటర్జీ వీధిలోని మమతా ఇంటి గోడ దూకాడు. ఉదయం వరకూ అక్కడే ఉండిపోయాడు. సెక్యూరిటీ పర్సనల్ ఆ వ్యక్తిని ఉధయం 8గంటల సమయంలో చూసి కలీఘాట్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

“ప్రాథమిక విచారణలో లాల్‌బజార్‌లోని కోల్‌కతా పోలీస్ హెడ్ క్వార్టర్స్ అనుకుని ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టానని.. తన ఉద్దేశ్యంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆ సమయంలో పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు వెళ్లాల్సిన అవసరమేంటనే దానిపై సమాధానం ఇవ్వలేకపోయాడు. ముందుగా తాను పండ్లు అమ్ముకునే వ్యక్తిని అని చెప్పిన హఫీజుల్.. తర్వాత వెహికల్ డ్రైవర్ “ని అని పేర్కొన్నాడు.

Read Also: ఏకగ్రీవానికి సహకరించండి.. మమతా బెనర్జీని కోరిన రాజ్‌నాథ్ సింగ్

పోలీసులు అతని మానసిక పరిస్థితి సరిగా లేదని భావిస్తున్నారు. ఈ ఘటన తర్వాత వెస్ట్ బెంగాల్ సీఎం ఇంటి భద్రతపై నిఘా పెంచారు. అంతేకాకుండా ఐపీసీ 458 ప్రకారం.. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు