Niti Valley Bridge : బాబోయ్ వరద విలయం.. క్షణాల్లో కొట్టుకుపోయిన బ్రిడ్జి.. వైరల్‌గా వీడియో
Niti Valley Bridge : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో నీటి ప్రవాహానికి ఓ మెటల్ బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది.
- Harish Thanniru
- Updated on- August 10, 2026 / 09:52 PM IST
Heavy rain in Uttarakhand Chamoli Niti Valley Bridge Collapse Video Goes Viral
Niti Valley Bridge : ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో నీటి ప్రవాహానికి ఓ మెటల్ బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read : Farmer Buried Rs 5 Lakh : దొంగల భయంతో భూమిలో రూ.5లక్షలు పాతిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత తవ్వి చూస్తే షాక్!
నీతి వ్యాలీ ప్రాంతంలో ఉన్న నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. లోతట్టు ప్రాంతాల వైపు ఆ వరదనీరు దూసుకొచ్చింది. నీటితోపాటు మట్టి, బురద, పెద్దపెద్ద బండరాళ్లు కొట్టుకొచ్చాయి. ఇవి వేగంగా వచ్చి ఢీకొనడంతో మెటల్ బ్రిడ్జి కొట్టుకుపోయింది. బ్రిడ్జిపై పలు వాహనాలు కొట్టుకుపోయాగా.. సమీప రహదారిపై ఉన్న ఓ ట్రక్ డ్రైవర్ అప్రమత్తమై అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయాడు.
బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నీతి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో రాకపోకలు తెగిపోయాయి. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఈ ప్రాంతంలో ప్రయాణాలు చేయవద్దని అధికారులు ప్రజలను కోరారు. నదులు, వాగుల సమీపంలో నివసించే ప్రజలు సురక్షిత దూరంలో ఉండాలని సూచించారు.
🚨 BREAKING: Niti Valley Alert!
Heavy rain in #Chamoli washed away Tamak Nala’s bailey bridge. Movement towards #NitiValley is suspended. @chamolipolice and @USDMAUk have deployed teams for immediate action. Safe travel advised.#Uttarakhand #BridgeCollapse #MonsoonAlert pic.twitter.com/HAVwZIFY5J
— jarvis ☠️ (@Vishii14) August 10, 2026
