Farmer Buried Rs 5 Lakh : దొంగల భయంతో భూమిలో రూ.5లక్షలు పాతిపెట్టిన రైతు.. ఏడాది తర్వాత తవ్వి చూస్తే షాక్!
Rajasthan Farmer Buried Rs 5 Lakh : రాజస్థాన్లోని రైతుకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. పొలంలో సంవత్సరం క్రితం డబ్బు పాతిపెట్టాడు.. ఇప్పుడు ఆ ప్రదేశంలో తొవ్వి చూడగా ఆశ్చర్య పోయాడు.
Rajasthan Farmer Buried Rs 5 Lakh
Rajasthan Farmer Buried Rs 5 Lakh : రాజస్థాన్లోని రైతుకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. నెవాయి గ్రామానికి చెందిన రైతు మంగిలాల్ దొంగల బారిన పడకుండా తన వద్ద ఉన్న రూ. 5లక్షలను తన పొంలంలో పాతిపెట్టాడు. ఆ తరువాత కొద్దిరోజులకు ఆ డబ్బును ఎక్కడ పాతిపెట్టింది మర్చిపోయాడు. ఎంత వెతికినా డబ్బులు పాతిపెట్టిన ప్రదేశం దొరకలేదు. అయితే, ఏడాది తరువాత అంటే.. ఇటీవల డబ్బులు పాతిపెట్టిన ప్రదేశంలో పొలం దున్నుతుండగా డబ్బుల సంచి కనిపించింది.. అక్కడ తొవ్వి చూడగా రైతు షాక్కు గురయ్యాడు.
మంగిలాల్ తన భూమిలో కొంత భాగం భూమిని విక్రయించగా రూ.5లక్షలు వచ్చాయి. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా తన భూమిలోనే ఓ ప్రదేశంలో పాతిపెట్టాడు. కొన్ని నెలల తరువాత ఆ డబ్బుకోసం వెతకగా.. ఎక్కడ తవ్వినా డబ్బు కనిపించలేదు. డబ్బు పాతిపెట్టిన స్థలాన్ని మర్చిపోయాడు. ఆందోళనకు గురైన మంగిలాల్ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. కుటుంబ సభ్యులతో కలిసి దాదాపు ఆరు ఎకరాల పొలంలో పలు చోట్ల తవ్వినా డబ్బు దొరకలేదు.
కొద్దిరోజుల క్రితం విత్తనాలు నాటేందుకు పొలంలో భూమిని దున్నుతున్న సమయంలో డబ్బుల సంచి బయటపడింది. దీంతో తన రూ.5లక్షలు తనకు దక్కాయనే ఆనందంతో రైతు మంగిలాల్, అతని కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో తవ్వి డబ్బుల సంచిని బయటకు తీశారు. కానీ, వారికి ఊహించని షాక్ తగిలింది. సంచి తెరిచి చూడగా.. అందులోని నోట్లను చెదపురుగులు తినేశాయి. దీంతో రైతు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంత మయ్యారు.
అయితే, ముక్కలు ముక్కలైన డబ్బులను స్థానిక ఎస్బీఐ బ్యాంక్ కు తీసుకెళ్లగా.. వాటిని తీసుకొనేందుకు బ్యాంక్ సిబ్బంది నిరాకరించారు. దీంతో రైతు, ఆయన కుటుంబ సభ్యులు నిరాశతో వెనుదిరిగి వెళ్లిపోయారు.
जमीन में पैसे कौन दबाता है इस किसान ने अपना प्लोट बेचकर चोरी के डर से 5 लाख रूपये ज़मीन में दबा दिए।
कुछ दिन बाद पैसे निकाले सारे पैसे दिमाक खा गई और बड़ा नुक्सान उठाना पड़ा। pic.twitter.com/ByAvdK8BH3
— 𝗠𝗮𝗿𝗶𝘆𝗮𝗺_𝗠𝗕𝗗 (@Mariyam_MBD) August 9, 2026
