బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ద్రోణి ప్రభావంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత కొద్ది రోజులుగా ముంబై, థానే ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్రలో అధికంగా కరోనా కేసులు నమోదువుతుంటం..వీటికి తోడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వంతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
స్థానికంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు. భారీ వర్షాలతో జన జీవనం స్థంబించడమే కాకుండా ఈ వాతావరణం కరోనా వైరస్ వ్యాప్తికి కారణం కావటంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
Read Here>>మహిళ లొంగిపోతే శృంగారానికి ఒప్పుకున్నట్టు కాదు…కేరళ హైకోర్టు