కర్ణాటకలోని సుత్తూరు మఠంలో మంగళవారం(ఫిబ్రవరి 5,2019) రెజ్లింగ్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరుకు 150 కిలోమీటర్ల దూరంలోని సుత్తూరు మఠంలో రెజ్లింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల ప్రారంభం కార్యక్రమానికి మఠం పీఠాధిపతి శివరాత్రి దీక్షేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం సందర్భంగా హీలియంతో నింపిన బెలూన్లను గాల్లోకి ఎగరవేస్తుండగా.. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో నైట్రోజన్ బెలూన్లను పట్టుకున్నారు. టోర్నమెంట్ కోసం పూజా కార్యక్రమం జరుగుతుండగా. క్రీడాజ్యోతి నైట్రోజన్ బెలూన్లకు తాకి ఒక్కసారిగా పేలిపోయాయి.
ఈ ప్రమాదంలో స్వామీజీతోపాటు ఎమ్మెల్సీ మరితిబ్బె గౌడ సహా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడటంతో నిర్వాహకులు వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. దీక్షేంద్ర స్వామితో పాటు ఇతరుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. బెలూన్లు కొద్దిగా దూరంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.