Hemant Soren
Hemant Soren absconding : జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు ఢిల్లీలోని సీఎం హేమంత్ సోరెన్ నివాసానికి సోమవారం ఉదయం ఈడీ అధికారులు వెళ్లారు. అయితే.. ఆయన ఇంట్లో లేరని, ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అధికార వర్గాలు తెలిపాయి. జనవరి 27 రాత్రి రాంచీ నుంచి ఢిల్లీకి వచ్చిన సోరెన్ ఎక్కడ ఉన్నారో తెలియడం లేదన్నారు.
భూకుంభకోణం, మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ ఈ నెల 27 సమన్లు జారీ చేసింది. జనవరి 29 నుంచి 31 తేదీల్లో ఏ రోజున విచారణకు అందుబాటులో ఉంటారో తెలియజేయాలని కోరింది. దీనిపై ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో సోమవారం ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. కాగా.. ఆయన జనవరి 31 మధ్యాహ్నం రాంచీలోని విచారణకు అందుబాటులో ఉంటానని ఈడీ అధికారులకు మెయిల్ చేసినట్లు సమాచారం.
బీజేపీ విమర్శలు..
కాగా.. సీఎం సోరెన్ ఈడీ అధికారులు ఢిల్లీలోని తన నివాసానికి వచ్చే సమాయానికి ఆయన ఇంట్లో లేకపోవడం, అధికారులకు అందుబాటులో లేకపోవడం పై జార్ఖండ్ బీజేపీ విమర్శనాస్త్రాలు గుప్పించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి భయపడి గత 18 గంటలుగా జార్ఖండ్ ముఖ్యమంత్రి అదృశ్యమయ్యారని పేర్కొంది.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం అర్థరాత్రి హేమంత్ చెప్పులు ధరించి, ముఖాన్ని వస్త్రంతో కప్పుకుని, కాలినడకన ఢిల్లీలోని తన నివాసం నుంచి పారిపోయాడని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బాబూలాల్ మరాండీ సోషల్ మీడియాలో తెలిపారు. సోరెన్‌తో పాటు ఢిల్లీకి వెళ్లిన స్పెషల్ బ్రాంచ్ సెక్యూరిటీ సిబ్బంది అజయ్‌సింగ్ కూడా కనిపించడం లేదన్నారు. ఇద్దరి మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అయ్యాయి. అప్పటి నుంచి ఈడీ, ఢిల్లీ పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. ముఖ్యమంత్రి భద్రత విషయంలో ఇంతటి నిర్లక్ష్యానికి మరో ఉదాహరణ ఉండదు అని ట్వీట్ చేశారు.
Family Pension : మహిళా ప్రభుత్వ ఉద్యోగులు భర్తకు కాకుండా పింఛన్ పిల్లలకే వచ్చేలా చేయొచ్చు
. @dir_ed के डर के मारे झारखंड के मुख्यमंत्री हेमंत सोरेन पिछले अठारह घंटे से दिल्ली वाले मुख्यमंत्री आवास से फ़रार हो कर भूमिगत हो गये हैं।
मीडिया सूत्रों के मुताबिक़ देर रात हेमंत जी हवाई चप्पल पहने हुए चादर से मुँह ढँककर चोर की तरह आवास से पैदल निकल कर भागे हैं। उनके साथ…
— Babulal Marandi (@yourBabulal) January 29, 2024