నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరేన్ ప్రమాణస్వీకారం : రాలేనన్న ప్రధాని

జార్ఖండ్‌  11వ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్‌ సొరేన్‌ తో

  • Publish Date - December 29, 2019 / 02:16 AM IST

జార్ఖండ్‌  11వ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్‌ సొరేన్‌ తో

జార్ఖండ్‌  11వ సీఎంగా హేమంత్‌ సొరేన్‌ ఇవాళ(డిసెంబర్ 29,2019) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాంచీలోని మొహ్రాబాడీ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం 2 గంటలకు హేమంత్‌ సొరేన్‌ తో గవర్నర్ ద్రౌపతి ముర్ము ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హేమంత్‌ సోరెన్‌తో పాటు కాంగ్రెస్, ఆర్జేడీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. జార్ఖండ్‌ ముక్తి మోర్చా, దాని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్‌ లో మంత్రుల ఎంపిక ఖరారైనట్లు తెలుస్తోంది. దీని ప్రకారం జేఎంఎం నుంచి ఆరుగురికి, కాంగ్రెస్‌ నుంచి నలుగురికి, ఆర్జేడీ నుంచి ఒకరికి మంత్రి పదవులు దక్కనున్నాయి.

హేమంత్‌ సొరేన్‌ తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాల్సిందిగా.. ప్రధాని నరేంద్రమోడీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌పవార్‌ లతో పాటు వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలను ఆహ్వానించారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేనని తెలిపిన మోడీ.. ప్రత్యేకంగా హేమంత్ సొరేన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

* నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సొరేన్ ప్రమాణ స్వీకారం
* మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణం
* సోరేన్‌ తో ప్రమాణం చేయించనున్న గవర్నర్‌ ద్రౌపతి ముర్ము
* రాలేను అని చెప్పిన ప్రధాని మోడీ
* కొత్త సీఎంకు మోడీ శుభాకాంక్షలు