Hijab Row: కర్ణాటకలో రెండు వారాల పాటు ఆందోళనలు నిషేదం

పార్లమెంట్ వేదికగా హిజాబ్, హెడ్ స్కార్వ్స్ ఉపయోగం గురించి బుధవారం చర్చకు వచ్చింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు.

Hijab Row: పార్లమెంట్ వేదికగా హిజాబ్, హెడ్ స్కార్వ్స్ ఉపయోగం గురించి బుధవారం చర్చకు వచ్చింది. బెంగళూరులో విద్యాసంస్థలైన స్కూల్స్, కాలేజీల వద్ద రెండు వారాల పాటు ఆందోళనలు జరపకూడదని నిషేదాజ్ఞలు విధించారు. పోలీసుల ఆదేశాల మేరకు ఏదైనా గుమిగూడటం లేదా ఆందోళన చేయడానికి అనుమతుల్లేవు. స్కూల్స్, కాలేజి చుట్టూ వైపుల 200మీటర్ల మేర రూల్స్ వర్తిస్తాయని అధికారులు తెలిపారు.

ఉడుపిలోని గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న ఐదుగురు మహిళలు వేసిన పిటిషన్ ను కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు. హిజాబ్ పై నిబంధనలు ఎందుకని ప్రశ్నలు అందులో ఉంచారు. ఈ పిటిషన్ ను పెద్ద బెంచ్ కు బుధవారం రిఫర్ చేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ రాజ్యసభలో హిజాబ్ ఇష్యూను లేవనెత్తారు. ‘ఆడబిడ్డను గౌరవించాలి. ఆమె మర్యాదతో ఆటలు ఆడకూడదు. ఈ ప్రపంచమంతా ఆడపిల్లలతో శ్రీరాముడి పేరు చెప్పి ఎలా ప్రవర్తిస్తున్నారో చూస్తూనే ఉంది. బీజేపీ దీనిని ప్రమోట్ చేసుకుంటుంది’ అని విమర్శించారు.

Read Also: ఆపని ఫోటో షూట్లు.. అషూ నీకిది తగునా?!

విద్యార్థులంతా శాంతి, సామరస్యంతో ఉండాలని పిలుపునిస్తూ కర్ణాటక సీఎం మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూసేయాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే, కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోఖ తాము (ప్రభుత్వం) హిజాబ్ కు గానీ, కాషాయానికి గానీ దేనికీ సపోర్టింగ్ గా లేమంటూ వ్యాఖ్యలు చేశారు.

ట్రెండింగ్ వార్తలు