కరోనా జబ్బు కాదు,మాంసాహారుల్ని శిక్షించే దేవుడి ఉగ్రావతారం, క్షమాపణ చెప్పకపోతే చస్తారు

  • Publish Date - February 17, 2020 / 06:40 AM IST

‘కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలి కావాలసిందే’ అని భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి అంటున్నారు. ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన.. అత్యధిక జనాభా ఉన్న చైనాతో పాటు ప్రపంచ దేశాల్లో కరోనా రావడానికి కారణం మాంసాహారమేనని అన్నారు. 

‘‘ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కాదనీ..అది మూగజీవాలను కాపాడే దేవుడి అవతారమని అవి మనకు మృత్యుసందేశాన్ని ఇవ్వడానికి, మూగజీవాలను తినేవారికి శిక్ష వేయడానికి వచ్చిందని  అని భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి  వ్యాఖ్యానించారు. మాంసం తినేవారిపై దేవుడు ధరించిన ఉగ్రావతారమే కరోనా (కొవిడ్‌-19) వైరస్‌  ‘‘కరోనా.. వైరస్‌ కాదు. అది మూగజీవాలను కాపాడే అవతారం..అని వ్యాఖ్యానించారు. చైనా వాసులు జంతువులను హింసిస్తున్నారు. వాటిని చంపి తింటున్నారు. అందుకే చైనాపై కరోనా వచ్చింది అన్నారు. 

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ‘‘కరోనా విగ్రహాన్ని సృష్టించి..దాన్ని ప్రతిష్టించి క్షమాపణ చెప్పాలి..లేకుండా చైనీయులంతా కరోనాకు బలైపోతారని వ్యాఖ్యానించారు. చైనీయులంతా భవిష్యత్తులో మాంసం తినమని ప్రతిజ్న చేయాలని..లేదండే కరోనా కాటుకు బలికాక తప్పదని అన్నారు. మాంసం తినమని చైనీయులంతా ప్రతిజ్న చేస్తే కరోనా కరుణిస్తుందని కరోనా మృతులు తగ్గిపోతారనీ..లేదంటే..చైనీయులు చేసే తప్పిదానికి ప్రపంచం అంతా కరోనా వ్యాపిస్తుందని అన్నారు. 

దేవుడిని ఆరాధించినవారికి కరోనా రాదని..అటువంటివారికి ప్రాణాంతక వ్యాధులు..వైరస్ లు సోకవని..దేవుడిని కొలిచేవారికి కరోనా సోకకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. 

ఆదివారం (ఫిబ్రవరి 16,2020) నాటికి పంచవ్యాప్తంగా 69,268 నవల కరోనావైరస్ కేసులు మరియు 1,670 మరణాలు నమోదయ్యాయి. వాటిలో 68వేల 500 కేసులు నమోదయ్యాయి. మాంసాహారులకే కరోనా వస్తోందని కాబట్టి మాంసం తినవద్దని సూచించారు భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి.