Covid in Elections: ఎన్నికలు జరిగిన ప్రతిచోటా పెరిగిపోతున్న కరోనా

కొవిడ్ 19 సెకండ్ వేవ్ చాలా రాష్ట్రాల్లో వణుకుపుట్టిస్తోంది. రాజకీయంగా, సామాజికంగా గుంపులుగా ఉండకూడదనే నిబంధనలు విధించేలా ..

Corona Virus

Covid Numbers Spiked: కొవిడ్ 19 సెకండ్ వేవ్ చాలా రాష్ట్రాల్లో వణుకుపుట్టిస్తోంది. రాజకీయంగా, సామాజికంగా గుంపులుగా ఉండకూడదనే నిబంధనలు విధించేలా చేస్తుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. దేశంలో కరోనా కేసులు మార్చి 15నుంచి పెరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి పొలిటికల్ ర్యాలీలు, రోడ్ షోలు దీనికి కారణంగా తెలుస్తుంది.

అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంతో పాటు వెస్ట్ బెంగాల్ లో మరో నాలుగు దశల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆశ్చర్యమేమీ లేకుండా రాష్ట్రంలో రాజకీయ ప్రచారం మంచి ఊపు మీద ఉంది.

మార్చి 17న ప్రధాని నరేంద్ర మోడీ.. వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించి.. పరిస్థితిని సమీక్షించరు. అజాగ్రత్త కారణంగానే కేసులు పెరుగుతున్నాయని.. టెస్ట్, ట్రాక్, ట్రీట్ అనే ఫార్ములాను సీరియస్ గా ఫాలో అవ్వాలని అప్పుడే వైరస్ సెకండ్ పీక్ ను అడ్డుకోగలమని పిలుపునిచ్చారు.

ఎన్నికలు జరిగిన రాష్ట్రాల వారీగా పెరిగిన కొవిడ్ కేసులు
పశ్చిమ బెంగాల్

ఎనిమిది దశల ఎన్నికల్లో భాగంగా మార్చి 27నుంచి మొదలై ఏప్రిల్ 29వరకూ కొనసాగనున్నాయి బెంగాల్ ఎన్నికలు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి మోడీ స్థాయి లాంటి వ్యక్తులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోసే పనిలో భాగంగా.. మమతా బెనర్జీని టార్గెట్ చేస్తూ భారీ ఎత్తులో సభలు, పబ్లిక్ మీటింగ్ లు నిర్వహించారు. ఈ క్రమంలో మమతా నందిగ్రామ్ నియోజకవర్గంలో కాలికి గాయం కూడా అయింది.

మార్చి 1న బెంగాల్ లో కేవలం 200కేసులు మాత్రమే ఉన్నాయి. అదే ఏప్రిల్ 13నాటికి అవి 3వేల 798కి పెరిగాయి. ఈ గ్యాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా 10లక్షల 10వేల 86మందికి పరీక్షలు నిర్వహించగా.. 170మృతులు సంభవించాయి.

తమిళనాడు
మార్చి 1నాటికి 470మాత్రమే ఉన్న కొత్త కేసులు.. ఏప్రిల్ 13నాటికి 5వేల 715కు చేరాయి. ఈ గ్యాప్ లో రాష్ట్ర వ్యాప్తంగా 31లక్షల 56వేల 777కొవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 444కరోనా మృతులు సంభవించాయి.

కేరళ
మార్చి 1న కేరళలో 3వేల 496ఉన్న కొత్త కేసులు.. ఏప్రిల్ 13నాటికి 5వేల 615కు పెరిగాయి. ఈ గ్యాప్ లో రాష్ట్రవ్యాప్తంగా 23లక్షల 65వేల 420కొవిడ్ టెస్టులు నిర్వహించారు. అందులో 604మంది కొవిడ్ కారణంగా మృతి చెందారు.

అస్సాం
మార్చి 1న 23మాత్రమే ఉన్న కొత్త కేసులు ఏప్రిల్ 13నాటికి 378కి పెరిగాయి. మొత్తం 8లక్షల 18వేల 546మందికి జరిపిన పరీక్షల్లో 26మంది మృతి చెందారు.

పుదుచ్చేరి
మార్చి1న కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కేవలం 19మాత్రమే కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 13న అవి 313కు చేరుకున్నాయి. ఈ గ్యాప్ లో 80వేల 711కొవిడ్ టెస్టులు నిర్వహించగా 27మంది ప్రాణాలు వదిలారు.