జమ్మూకశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్ : ముగ్గురు ఉగ్రవాదులు హతం

  • Publish Date - October 16, 2019 / 07:13 AM IST

జమ్మూకశ్మీర్ లో అనంతనాగ్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. సైనికులు.. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు. పాజల్ పురా ఏరియాలో హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు భద్రతా బలగాలకు సమచారం అందింది. దీంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా అక్కడ ఆపరేషన్ నిర్వహించాయి. 

ఈక్రమంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ఉగ్రదాడిని తిప్పికొట్టాయి. అప్రమత్తంగా ఉన్న భద్రతా బలగాలు…వారి ప్రయత్నాలను వమ్ము చేశాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు వెల్లడించారు.