Raidurg Land Auction: తెలంగాణ ప్రభుత్వం బిగ్ స్కెచ్.. రాయదుర్గం భూముల ఈ-వేలం.. ఎకరం భూమి రూ.175 కోట్లు..
తెలంగాణ ప్రభుత్వం రాయదుర్గంలోని అత్యంత విలువైన భూములను ఈ-వేలం(Raidurg Land Auction) ద్వారా విక్రయించేందుకు సిద్ధమైంది.
- V Santhosh Kumar
- Published on- August 3, 2026 / 08:10 AM IST
Hyderabad real estate raidurg land auction record reserve price 175 crore
- రాయదుర్గంలో భూముల ఈ-వేలం
- ఎకరం ధర రూ.175 కోట్లు
- కేపీహెచ్‌బీ స్థలాలకు భారీ డిమాండ్
Raidurg Land Auction: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరొక చారిత్రక రికార్డుకు వేదిక కాబోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిధుల సమీకరణ ప్రక్రియలో భాగంగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం, రాయదుర్గంలోని ఐటీ నాలెడ్జ్ సిటీలో అత్యంత విలువైన భూములను ఈ-వేలం(Raidurg Land Auction) ద్వారా విక్రయించేందుకు సిద్ధమైంది. సర్వే నంబర్ 83/1 పరిధిలోని ఈ స్థలాలు బహుళ ప్రయోజన వినియోగానికి అనుకూలంగా ఉన్నాయి.
Pm Modi: ఆగస్టు 5న ఏం జరగబోతోంది? కేంద్రం నుంచి మరో సంచలన ప్రకటన? ఢిల్లీలో బిగ్ స్కెచ్
రాయదుర్గంలో రికార్డు ధరలు & రాబడి లక్ష్యం:
నాలెడ్జ్ సిటీ లేఅవుట్‌లో రెండు ప్లాట్లుగా ఉన్న మొత్తం 10 ఎకరాలకు పైగా భూమిని ప్రభుత్వం అమ్మకానికి ఉంచింది. గత వేలంతో పోలిస్తే ఈసారి రిజర్వ్ ప్రైస్‌ను 26 శాతం పెంచి, ఎకరాకు కనీస ప్రారంభ ధరగా రూ.175 కోట్లుగా నిర్ణయించడం గమనార్హం. ఈ భారీ స్థలాల విక్రయం ద్వారా దాదాపు రూ.2,500 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు రాబడి సమకూరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
కేపీహెచ్‌బీలో ఇందిరమ్మ టవర్ల స్థలాలు:
మరోవైపు కేపీహెచ్‌బీ ఫేజ్ 15 పరిధిలో ఉన్న హౌసింగ్ బోర్డు స్థలాలను కూడా ప్రభుత్వం వేలానికి సిద్ధం చేసింది. ఇందిరమ్మ టవర్ల నిర్మాణానికి సేకరించిన స్థలాల్లోని 24 ప్లాట్లకు ఈ నెల 14వ తేదీన ఈ-వేలం నిర్వహించనున్నారు. ఇక్కడ చదరపు గజానికి కనీస ధరను రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. ఈ వేలం పాటల ద్వారా అదనంగా రూ.100 కోట్ల ఆదాయం వస్తుందని పౌర సంబంధాల వర్గాలు ఆశిస్తున్నాయి.
