I was one of the people who took decision to make Shinde CM says Fadnavis
Devendra Fadnavis: ఏక్నాథ్ షిండేను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా నిర్ణయించిన వారిలో తాను కూడా ఒకడినని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. నిజానికి తాను ప్రభుత్వం బయట ఉండి పని చేయాలని అనుకున్నానని అయితే బయటి ఉండి పని చేయడానికి అదనపు రాజ్యాంగ నియమాలను నేను తయారు చేయాలనుకోలేదని అందుకే పార్టీ ఆదేశాలనుసారం తాను ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ఫడ్నవీస్ తెలిపారు.
వాస్తవానికి మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం కూలిన అనంతరం షిండే నేతృత్వంలోని శివసే, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించాయి. అందరూ దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు. కానీ, చివరి నిమిషంలో షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అందరికీ షాక్ ఇచ్చారు. అధికార దాహంతో ఉద్ధవ్ ప్రభుత్వాన్ని బీజేపీనే కూల్చిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటోందనే మచ్చ తొలగించుకోవడానికే షేండేకు ముఖ్యమంత్రి పదవిని బీజేపీ అధిష్టానం కట్టబెట్టినట్లు గుసగుసలు వినిపించాయి.
బీజేపీ అధిష్టానం నిర్ణయంతో ఫడ్నవీస్ చాలా అసంతృప్తికి లోనయ్యారని, అంతకు ముందు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన ఆయన చాలా బలవంతంగా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారని అప్పట్లో వినిపించాయి. అయితే అలాంటిదేమీ లేదని, షిండేను ముఖ్యమంత్రిగా నిర్ణయించిన వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని, బీజేపీ కార్యకర్తగా ఏ స్థానంలోనైనా పని చేయడానికి తాను సిద్ధమని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.
PM Narendra Modi: బ్రిటన్ పీఎం లిజ్ ట్రస్‌కు మోదీ ఫోన్.. క్వీన్ ఎలిజబెత్ మృతిపై సంతాపం