Army Chopper Crash : బిపిన్ రావత్ సహా హెలికాఫ్టర్ లోని అందరూ మృతి
త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ భార్య మధులిక మరణించినట్లు కొద్ది సేపటి క్రితం
- venkaiahnaidu
- Updated on- December 8, 2021 / 06:15 PM IST
C8
Army Chopper Crash : తమిళనాడులోని కూనూర్ సమీపంలో బుధవారం మధ్యాహ్నాం భారత వాయుసేనకు చెందిన Mi-17V5 హెలికాఫ్టర్ కూలిపోయిన ఘటనలో హెలికాప్టర్ లోని వారంతా మృతి చెందారు. తీవ్ర గాయాలతో వెల్లింగ్టన్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ భార్య మధులిక మరణించినట్లు కొద్ది సేపటి క్రితం అధికారులు కన్ఫర్మ్ చేశారు.
ప్రమాద సమయంలో హెలికాఫ్టర్ లో త్రివిధ దళాధితి బిపిన్ రావత్,ఆయన భార్య సహా మొత్తం 14మంది ఉండగా మొదట బిపిన్ రావత్ మినహా అందరూ చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. తీవ్ర గాయాలపాలైన బిపిన్ రావత్ కు వెల్లింగ్టన్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు తెలిపింది. అయితే కాసేపటిక్రితం ఆయన చనిపోయినట్లు వెల్లడించింది.
ALSO READ Army Chopper Crash : ఆర్మీ హెలికాఫ్టర్ ప్రమాదం..త్రివిధ దళాధిపతి పరిస్థితి విషమం..అసలేం జరిగింది!
