IAS Topper Divorce : రెండేళ్లకే విడాకులు తీసుకున్న IAS టాపర్లు
మతాంతర వివాహం చేసుకుని వార్తల్లో నిలిచిన ఐఏఎస్ జంట విడిపోయారు. వివాహం చేసుకున్న రెండు సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు ఐఏఎస్ టాపర్స్ టీనా దాబి, అథర్ ఖాన్ లు.
- nagamani
- Published On : August 11, 2021 / 03:34 PM IST
Ias Topper Couple Gets Divorce
IAS Topper Couple Gets Divorce : రాజస్థాన్ కేడర్ కు చెందిన టీనా దాబి, అథర్ ఆమిర్ ఖాన్..ఇద్దరూ ఐఏఎస్ టాపర్లు. టీనా దాబి తొలి ప్రయత్నంలోనే సివిల్స్ ను సాధించిన తొలి దళిత మహిళగా రికార్డు సృష్టించారు. ట్రైనింగ్ సమయంలో టీనాకు అథర్ అమీర్ ఖాన్ కు మధ్య పరిచయం ఏర్పడింది. అదికాస్త ప్రేమగా మారింది. ప్రేమకు కులాలు మతాలు తెలియవు కదా..అలా ఇద్దరూ మతాలు వేరు అయినా జీవితాంతం కలిసి సంతోషంగా ఉందామని వివాహం చేసుకున్నారు. కానీ ఏమైందో ఏమోగానీ ఇద్దరూ విడిపోయారు. అదికూడా పరస్పరం ఇష్టంలోనే విడిపోయారు. ఇష్టంతో వివాహం ఎలా అయితే చేసుకున్నారు..అలేగా ఇష్టపడే విడిపోయారు టీనా, అమీర్ ఖాన్ లు.
2015లో నిర్వహించిన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్స్ పరీక్షలో టీనా టాపర్.అథర్ సెకండ్ ర్యాంకర్. వారిద్దరి మనసులు కలిశాయి. 2018లో మతాంతర వివాహం చేసుకున్నారు. వీరిది మతాంతర వివాహం కావటంతో అందరి దృష్టి వీరిమీదే పడింది. వారిద్దరి పెళ్లిపై ‘లవ్ జిహాద్’ అన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ వాటిని ఏమాత్రం పట్టించుకోనని, తమది మతాలకు అతీతమైన పెళ్లి అని టీనా తెలిపారు. వీరి వివాహానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్, కేంద్ర మంత్రులు హాజరయ్యారు కావటం మరింత చర్చనీయాంశమైంది.
టీనా,అథర్ రాజస్తాన్ రక్యాడర్ లో జైపూర్ లోనే విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం టీనా అక్కడే ఉండగా అథర్ మాత్రం డెప్యూటేషన్ పై తన సొంత రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ వెళ్లి శ్రీనగర్ లో విధులు నిర్వర్తిస్తున్నారు. టీనాది మధ్యప్రదేశ్ లోని భోపాల్. సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా ఆమెపేరు అప్పట్లో మారు మ్రోగింది.
రెండేళ్లైంది వీరి వివాహం జరిగి. ఈ మధ్యలో ఏమైందో గానీ.. రెండేళ్లకే జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు ఇద్దరూ. తాజాగా కోర్టు ఆ దంపతులకు విడాకులను మంజూరు చేసింది. 2020 నవంబర్ లో పరస్పర అంగీకారంతో విడాకులకు దరఖాస్తు చేశారని వారి కుటుంబ సభ్యులే చెబుతున్నారు. అలా ఇష్టపడి వివాహం చేసుకున్న ఇద్దరూ ఐఏఎస్ టాపర్లు ఇష్టపడే విడాకులు తీసుకోవటం గమనించాల్సిన విషయం. ప్రేమ ఎలా పుడుతుందో..ఎలా తెగిపోతుందో కనిపెట్టటం ఎవ్వరి వల్లా కాదు అనే విషయం మరోసారి రుజువైంది. వీరి వివాహం..విడాకుల నేపథ్యం తలచుకుంటే..
