Chhattisgarh: దమ్ముంటే బయటపెట్టండి.. నడ్డాకు సీఎం బాఘేల్ ఛాలెంజ్

ఛత్తీస్‭గఢ్‭లో రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, రాజీవ్ గాంధీ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన కింద రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిన్న అడవుల ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. వారు గిరిజనులైనా, కూలీలైనా, షెడ్యూల్డ్ ట్రైబ్ అయినా డబ్బులు నేరుగా వారి జేబుకు అందజేస్తున్నాం. కానీ బీజేపీ పాలనలో ఇవి ఇవ్వలేకపోయారు

Chhattisgarh: భారతీయ జనతా పార్టీ అధినేత జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలపై ఛత్తీస్‭గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్పందించారు. నడ్డా చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజమున్న వెంటనే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలో 71 మంది గిరిజనులను అకారణంగా చనిపోయారంటూ ఛత్తీస్‭గఢ్ పర్యటన సందర్భంగా నడ్డా వ్యాఖ్యానించారు. దీని వెనుక పెద్ద కుట్ర కోణమే ఉందని ఆయన ఆరోపించారు.

నడ్డా వ్యాఖ్యలపై సీఎం బాఘేల్ స్పందిస్తూ ‘‘గిరిజనులు చనిపోవడం వెనుకు కుట్ర ఉందని నడ్డా అనుకుంటే.. ఆ కుట్రేంటో బయటపెట్టండి. అవాస్తవాలను పట్టుకుని ప్రభుత్వంపై అభాండాలు మోపడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ ఇది నిజమైతే ఎందుకు ఆధారాలు చూపించడం లేదు. దమ్ముంటే ఆ కుట్రేంటో భయటపెట్టమని నడ్డాకు ఛాలెంజ్ చేస్తున్నాను’’ అని అన్నారు.

ఇంకా ఆయన స్పందిస్తూ ‘‘ఛత్తీస్‭గఢ్‭లో రాజీవ్ గాంధీ కిసాన్ యోజన, రాజీవ్ గాంధీ భూమిహిన్ కృషి మజ్దూర్ న్యాయ్ యోజన, గోధన్ న్యాయ యోజన కింద రైతులకు కనీస మద్దతు ధర కల్పిస్తున్నాం. అంతే కాకుండా చిన్న అడవుల ఉత్పత్తులకు కూడా కనీస మద్దతు ప్రకారం కొనుగోలు చేస్తున్నాం. వారు గిరిజనులైనా, కూలీలైనా, షెడ్యూల్డ్ ట్రైబ్ అయినా డబ్బులు నేరుగా వారి జేబుకు అందజేస్తున్నాం. కానీ బీజేపీ పాలనలో ఇవి ఇవ్వలేకపోయారు. అందుకే మాపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వీటిని ఉచితాలు అంటూ ప్రజలను ఎగతాళి చేస్తున్నారు’’ అని అన్నారు.

Mumbai: గణేష్ నిమజ్జనంలో శివసేన vs శివసేన.. ముంబైలో ఇరు కార్యకర్తల ఫైట్

ట్రెండింగ్ వార్తలు