Congress President Poll: గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించి ఖర్గేకు ఓటేయమంటూ థరూర్ సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ కుటుంబ మద్దతుతో పోటీలో నిలిచిన ఖర్గేకు ఓట్లేయడమనడం, దానికి కాంగ్రెస్ పనితీరుపై రెఫరెండాన్ని చూపడం చూస్తుంటే గాంధీ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు.

Congress President Poll: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఎట్టకేలకు ఇద్దరు నేతలు మాత్రమే మిగిలారు. ఒకరు శశి థరూర్, మరొకరు మల్లికార్జున ఖర్గే. కాగా, ఈ పోటీపై శనివారం శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నట్లైతే మల్లికార్జున ఖర్గేకు ఓటేయమని, మార్పు కావాలనుకుంటే తనకు ఓటేయమని కాంగ్రెస్ నేతలకు థరూర్ సూచించారు.

కాంగ్రెస్ పార్టీ అంతర్గత ఎన్నికలపై కాంగ్రెస్ నేతే ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. చాలా ఏళ్లుగా పార్టీని గాంధీ కుటుంబమే అధికారికంగా నడిపిస్తోంది. థరూర్ చేసిన వ్యాఖ్యలు గాంధీ కుటుంబాన్ని ఉద్దేశించేనని విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు గాంధీ కుటుంబ మద్దతుతో పోటీలో నిలిచిన ఖర్గేకు ఓట్లేయడమనడం, దానికి కాంగ్రెస్ పనితీరుపై రెఫరెండాన్ని చూపడం చూస్తుంటే గాంధీ కుటుంబాన్నే టార్గెట్ చేసి ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు అంటున్నారు.

అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో థరూర్ శుక్రవారం ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘‘పార్టీ పని తీరుతో సంతృప్తి చెందితే ఖర్గే గారికే ఓటు వేసుకోండి, మార్పు జరగాలనుకుంటే, పార్టీ విభిన్నంగా పని చేయాలని కోరుకుంటే, నన్ను ఎన్నుకోండి’’ అని అన్నారు. ఇంతా వ్యాఖ్యలు చేసి.. తమది కేవలం స్నేహపూర్వకమైన పోటీయేనని థరూర్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక గాంధీ కుటుంబంపై ఆయన స్పందిస్తూ పార్టీకి ఆ కుటుంబం చాలా ముఖ్యమైందని, వారికి గుడ్ బై చెప్పే అవివేకి అయిన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండరని థరూర్ అన్నారు.

Rajastan Crisis: రాజస్తాన్ సీఎంగా తానే కొనసాగుతానని పరోక్ష సూచనలు చేసిన గెహ్లాట్

ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ శనివారంతో ముగిసింది. పోటీలో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మాత్రమే మిగిలారని కాంగ్రెస్ నేత, ఎన్నికల అధికారిగా ఉన్న మధుసూధన్ మిస్త్రీ ప్రకటించారు. దీంతో ఇద్దరు సీనియర్ నేతల మధ్య అధ్యక్ష పదవికి పోటీ జరిగే అవకాశం ఉంది. మరోవైపు రేసులో ఉంటాడని భావించిన ఝార్ఖండ్ మంత్రి కేఎన్ త్రిపాఠి నామినేషన్ తిరస్కరణకు గురైంది.

నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన వివరాల్ని ఎన్నికల అధికారి వెల్లడించారు. ఈ పోటీకి మొత్తం 20 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సంతకం సరిపోలకపోవడంతో నాలుగు అప్లికేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. కేఎన్ త్రిపాఠి దరఖాస్తు కూడా సంతకం మ్యాచ్ కాకపోవడంతోనే తిరస్కరణకు గురైంది. దీంతో ప్రస్తుతం పోటీలో శశిథరూర్, మల్లికార్జున ఖర్గే మాత్రమే మిగిలారు. వీరిలో సోనియా, రాహుల్ మద్దతు మల్లికార్జున ఖర్గేకు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Nitin Gadkari: నేను మధ్యతరగతి వాడిని, మీ కారు కొనలేను.. బెంజ్ కార్లను ఉద్దేశించి గడ్కరీ ఈసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు