Asaduddin Owaisi: నేను స్వేచ్ఛా జీవిని.. అలానే బతకాలనుకుంటున్నా – ఒవైసీ

ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు. పార్లమెంట్ వేదికగా ప్రసంగించిన అమిత్ షా.. అసదుద్దీన్ ప్రాణాలకు ....

Asaduddin Owaisi: ఏఐఎమ్ఐఎమ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న జెడ్ కేటగిరీ సెక్యూరిటీని తిరస్కరించారు. పార్లమెంట్ వేదికగా ప్రసంగించిన అమిత్ షా.. అసదుద్దీన్ ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు కేంద్ర భద్రతా వర్గాల నుంచి సమాచారం వచ్చిందని అన్నారు. అందుకే ఇప్పటికైనా కేంద్రం కల్పిస్తున్న జెడ్ కేటగిరీని ఒప్పుకోవాలని సూచించారు.

అమిత్ షా చేసిన కామెంట్లకు స్పందించిన ఒవైసీ.. ‘హోం మంత్రి అమిత్ షా జెడ్ కేటగిరీకి ఒప్పుకోమని అంటున్నారు. నా ప్రాణం విలువ సీఏఏ ఆందోళనలో ప్రాణాలు కోల్పోయిన 22మంది కంటే విలువైనవి కాదని అన్నారు. తాను స్వేచ్ఛాజీవినని, అలాగే బతకాలనుకుంటున్నానని వెల్లడించారు.

పార్లమెంట్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి.. ఒవైసీ కాన్వాయ్ పైకి కాల్పుల ఘటనలో యూపీ గవర్నమెంట్ నుంచి రిపోర్ట్ తీసుకున్నామని, ఒవైసీ తన పర్యటన సమాచారాన్ని హపూర్ జిల్లా పోలీస్ అధికారులకు అందించలేదని రాజ్యసభకు తెలియజేశారు అమిత్ షా.

Read Also: మరో 100ఏళ్లు కాంగ్రెస్ అధికారంలోకి రాదు – పీఎం మోదీ

‘మీరట్ నుంచి ప్రచారంలో పాల్గొని ఢిల్లీ వస్తుండగా చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరిగాయి. ఒవైసీ కాన్వాయ్ లోని కారుకు మూడు బుల్లెట్లు తగిలినప్పటికీ సురక్షితంగా బయటపడ్డారు. సాక్షుల ధ్రువీకరణతో ఇద్దరిపై IPC సెక్షన్ 307 కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి విచారణ కొనసాగుతోంద’ని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు