In Battle Of 2 Officers In Karnataka, Private Pics Posted On Social Media
IAS vs IPS: కర్ణాటక క్యాడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ మహిళా అధికారుల మధ్య వివాదం తారస్థాయికి చేరింది. వ్యక్తిగత ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఉన్నత స్థానంలో ఉన్న ఈ ఇద్దరు అధికారులు ఇలా వ్యవహరించడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీరిని కంట్రోల్ చేసే విషయంలో ఇప్పటికే బొమ్మై ప్రభుత్వం పట్టు కోల్పోయిందనే చెప్పవచ్చు. ప్రభుత్వం చేసే హెచ్చరికలను పట్టించుకోకుండా రచ్చ చేస్తూనే ఉన్నారు. అయితే ప్రవర్తన మారకపోతే తీవ్రమైన చర్యలు తప్పవని కర్ణాటక హోంమంత్రి అరగ జ్ణానేంద్ర సోమవారం మరోసారి హెచ్చరికలు చేశారు.
Assam: భర్తను అత్తను చంపేసి.. మృతదేహాల్ని ఫ్రిజ్‌లో కుక్కిన మహిళ
విషయంలో వస్తే.. ఇప్పటికే పలు వివాదాలలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవదాయశాఖ కమిషనర్ రోహిణి సింధూరి(ఐఏఎస్) మీద హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ రూపా ముద్గల్(ఐపీఎస్) ఆదివారం ట్విటర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు. రోహిణి వ్యక్తిగత ఫొటోలను కూడా అందులో పోస్ట్ చేశారు. ఐఏఎస్ రోహిణి, ఎమ్మెల్యే సారా మహేశ్‌తో రాజీ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ రూప ప్రశ్నించారు. ‘‘చామరాజనగరలో కొవిడ్ వేళ ఆక్సిజన్ అందక పలువురు మరణించిన అంశంలోనూ సక్రమంగా వ్యవహరించారా? కొవిడ్‌తో దేశమంతటా జనం తల్లడిల్లుతుంటే మైసూరు కలెక్టరేట్‌లో విలాసవంతమైన స్విమ్మింగ్ పూల్ నిర్మించడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి’’ అని విమర్శించారు.
Shiv Sena: ఉద్ధవ్ థాకరేకు మిగిలిన ఆఖరి పోరాటం అదే
ఐపీఎస్ ఎన్.హరీశ్ మృతిపైనా ఆమె అనుమానం వ్యక్తం చేశారు. జాలహళ్లిలో విలాసవంతమైన ఇల్లు నిర్మించే విషయాన్నీ కూడా ప్రస్తావించారు. ‘‘ఆమెకు ఎవరు మద్దతిస్తున్నారో? ఇటువంటి వారికి ఎందుకు శిక్షలు పడవో అర్థం కావడం లేదు’ అంటూ విమర్శించారు. అయితే తనపై ఆరోపణలు చేసిన రూపపై న్యాయ పోరాటం చేస్తానని రోహిణి తెలిపారు. ‘‘బాధ్యతాయుతమైన హోదాల్లో ఉన్నవారు సమాజానికి మంచి పనులు చేయాలిగానీ, వ్యక్తిగత విషయాలపై అబద్ధాలు పోస్టు చేయడం సరికాదు’’ అంటూ ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.