Supreme Court: ప్రభుత్వాలన్నీ కలిసి ఎన్నికల సంఘం స్వతంత్రతను ధ్వంసం చేశాయి

ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన తేదీని ఆధారంగా చేసుకుని వయసు దగ్గర పడ్డ వారిని సీఈసీగా నియమించి, ఆరేళ్ల పాటు పూర్తి కాలం పదవిలో ఉండకుండా ప్రభుత్వమే జాగ్రత్త పడుతోంది

Supreme Court: భారత ప్రధాన ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి పదవీ కాలాన్ని పొందకుండా, భారత ఎన్నికల స్వాతంత్ర్యాన్ని అన్ని ప్రభుత్వాలు ధ్వంసం చేశాయని మంగళవారం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1996 నుండి వచ్చిన ప్రభుత్వాలు ఇదే పని చస్తూ ఎన్నికల సంగాన్ని ‘పూర్తిగా నాశనం చేశాయి’ అని ధర్మాసనం విచారం వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకానికి చట్టం లేకపోవడం ఆందోళనకరమైన ధోరణికి దారితీసిందని సుప్రీం ఆవేదన వ్యక్తం చేసింది.

చీఫ్ ఎన్నికల కమీషనర్‌ సహా ఇతర ఎన్నికల కమీషనర్‌లను ఎలా ఎన్నుకోవాలనే దానిపై రాజ్యాంగంలోని నిశ్శబ్దాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ అవసరాల కోసం సమర్ధవంతంగా ఉపయోగించుకుంటున్నాయని, ఎన్నికైన వారు కాకుండా నియామకమైన వారి వల్ల విధి నిర్వహణ ఆందోళనలకు దారితీయొచ్చని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ వ్యాఖ్యానించింది.

“ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన తేదీని ఆధారంగా చేసుకుని వయసు దగ్గర పడ్డ వారిని సీఈసీగా నియమించి, ఆరేళ్ల పాటు పూర్తి కాలం పదవిలో ఉండకుండా ప్రభుత్వమే జాగ్రత్త పడుతోంది. అది యూపీఏ (కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం కావచ్చు లేదా ఈ ప్రభుత్వం (భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్) కావచ్చు, ఇది ఒక ట్రెండ్‌గా ఉంది” అని జస్టిస్ కెఎం జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

ఇంకా ధర్మాసంన స్పందిస్తూ “ఈ విధంగా తక్కువ కాలం పదవికి పరిమితం చేస్తూ ఎన్నికల సంఘం స్వాతంత్ర్యాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారు. ప్రత్యేకించి ఈ విషయంలో మేము కనుగొన్న ఆందోళనకరమైన అంశాన్ని బట్టి, ఎటువంటి తనిఖీ లేనందున ఎవరూ వారిని ప్రశ్నించలేరనే దృక్పథంలో ఉన్నారు. రాజ్యాంగంలోని కొన్ని నిశ్వబ్దాలను ఇలా ఉపయోగించుకోవచ్చు. చట్టం లేదు, నైతికత లేదు, ప్రతి ఒక్కరూ దానిని తమ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారు. పదవీ కాలాన్ని కుదించి సీఈసీని నియమిస్తున్నారు. ఇదొక వేలం పాటలా మారింది’’ అని పేర్కొంది.

Supreme Court: సుప్రీం కోర్టు నాలుగు ప్రత్యేక బెంచ్‭లు.. స్పష్టం చేసిన సీజేఐ

ట్రెండింగ్ వార్తలు