India: ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సదస్సుకు ఎంపికైన ఇండియా

ఐక్యరాజ్య సమితి ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ 2022-24కు ఇండియా ఎంపికైంది. 54మంది సభ్యులున్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కు హృదయం వంటిది. డెవలప్మెంట్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అంశాల్లో...

India: ఐక్యరాజ్య సమితి ఎకనామిక్, సోషల్ కౌన్సిల్ 2022-24కు ఇండియా ఎంపికైంది. 54మంది సభ్యులున్న ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అనేది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ కు హృదయం వంటిది. డెవలప్మెంట్, సోషల్, ఎన్విరాన్మెంటల్ అంశాల్లో డెవలప్మెంట్ కోసం పనిచేస్తుంటుంది.

డిబేట్, ఇన్నోవేటివ్ థింకింగ్, మెజారిటీ ఆలోచనా తీరును ముందుకు తీసుకుపోవడం, కృషిలో సమన్వయం వంటివి అంతర్జాతీయంగా సాధించే లక్ష్యాలు. అంతేకాకుండా ఐక్యరాజ్య సమతి సదస్సులు, సమావేశాలు నిర్వహించడంలోనూ బాధ్యత వహిస్తుంది.

ఆసియా-ఫసిఫిక్ స్టేట్స్ క్యాటగిరీలో Afghanistan, Kazakhstan, Oman దేశాలతో పోటీపడ్డ సోమవారం గెలిచినట్లు ప్రకటించారు. ఆఫ్రికా దేశాల నుంచి Côte d’Ivoire, Eswatini, Mauritius, Tunisia, United Republic of Tanzania ఈస్టరన్ యూరోపియన్ స్టేట్స్ నుంచి Croatia, Czech Republic, లాటిన్ అమెరికా నుంచి Caribbean states, Belize, Chile, Peruలు గెలిచాయి.

‘ఇండియాకు ఓటు వేసిన సభ్యులందరికీ ధన్యవాదాలు’ అని ఐక్యరాజ్యసమితి ఇండియా శాశ్వత అధికార ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2021-22కు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇండియా తాత్కాలిక సభ్యత్వంతో కొనసాగుతోంది.

ట్రెండింగ్ వార్తలు