పాక్ లోని ఉగ‌్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులపై ప్రతిపక్షాలను తీరుని ప్రధాని మోడీ తప్పుబట్టారు. రాఫెల్ యుద్ధవిమానాలు మన దగ్గర లేకపోవడం వల్లే యావత్ దేశం భాధపడుతుందని అన్నారు. శనివారం(మార్చి-2,2019) ఢిల్లీలో నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ లో పాల్గొన్న మోడీ..రాఫెల్ యద్ధ విమానాలు మన దగ్గర ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని అన్నారు. రాఫెల్ యుద్ధ విమానాల విషయమై గతంలోనూ ఇప్పుడు కొనసాగుతున్న స్వార్థ రాజకీయాల వల్ల దేశం చాలా నష్టపోయిందని అన్నారు. విపక్షాలకు తనను విమర్శంచే హక్కు ఉందని, అయితే మసూద్ అజర్,హఫీజ్ సమూద్ లాంటి ఉగ్రవాదులకు ఆ విమర్శలు ఉపయోగపడకూడదని అన్నారు. కొంతమంది సొంత దేశాన్నే వ్యతిరేకిస్తున్నారన్నారు. మన దేశం ముందున్న పెద్ద సవాళ్లలో ఇదొకటని మోడీ అన్నారు.
కొన్ని పార్టీలు మన సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను శంకిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రక్షణరంగంలో చాలా కుంభకోణాలు జరిగాయని,జీపులతో మొదలైన వారి కుంభకోణాలు, ఆయుధాలు,జలాంతర్గాములు, హెలికాఫ్టర్ల వరకు విస్తరించిందన్నారు.ప్రతి జవాను ప్రాణం తమకు మఖ్యమేనని తెలిపారు. భారత సాయుధ బలగాల ధైర్యసాహసాలను చూసి భయపడుతున్నదని,ఇది మంచిదేనన్నారు. అభినందన్ అనే పదానికి ఇప్పటివరకు కృతజ్ఞతలు అని అర్థమని, కానీ ఇప్పుడు ఆ పదానికి అర్థం మారిపోనున్నది అని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్ ఏం చేస్తున్నదనే విషయాన్ని ప్రపంచ దేశాలు నిశితంగా గమనిస్తున్నాయని, డిక్షనరీలోని పదాలకు భారత్ సరికొత్త అర్థాన్ని తీసుకురాగలదన్న విషయాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయని అన్నారు.