×
Ad

Corona Cases : దేశంలో కొత్తగా 5,874 కరోనా కేసులు, 25 మరణాలు

గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.

  • Published On : April 30, 2023 / 04:06 PM IST

Corona Cases (2)

Corona Cases : భారత్ లో మళ్లీ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా మరోసారి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 5,874 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో కరోనా బారిన పడి 25 మంది మృతి చెందగా వీరిలో కేరళలోనే 9మంది చనిపోయారు.

గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి. ఇప్పటివరకు 4,43,64,841 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 49,015 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.

Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

దేశంలో ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి మరో 5,31,533 మంది మృతి చెందారు. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 3.31శాతం ఉంది. రికవరీ రేటు 98.71శాతం, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,20,66,66,261 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.