Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

సుప్రీంకోర్టులో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజాకు గురి అయ్యింది. నలుగురు న్యాయమూర్తులు కోవిడ్ తో బాధపడుతున్నారు. దీంతో కేసుల విచారణ ఆందోళనకరంగా మారింది.

Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

Covid-19 In Supreme Court

supreme court : సుప్రీంకోర్టులో కరోనా మరోసారి కలకలం రేపుతోంది. గతంలో న్యాయమూర్తులు, న్యాయవాదులతో పాటు పలువురు ధర్మాసనం సిబ్బంది కోవిడ్ బారిన పడటంతో సుప్రీంకోర్టులో మూసివేయబడింది. కేసుల విచారణలు వర్చువల్ లోనే జరిగాయి. సుప్రీంకోర్టే కాదు దేశవ్యాప్తంగా ధర్మాసనాలు అన్ని మూతపడి వర్చువల్ గానే కేసుల విచారణ జరిగాయి. ఆ తరువాత కరోనా కేసులు తగ్గాగ తిరిగి ధర్మాసనాలు తెరుచుకోవటం..కేసులు యధావిధిగా కొనసాగుతున్నాయి. ఈక్రమంలో మరోసారి కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా దాదాపు 15వేలకు చేరుకోగా ఆ ప్రభావం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు కూడా తాకింది. పలువురు న్యాయమూర్తులు కోవిడ్ బారిన పడ్డారు.

నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అనిరుద్ధ బోస్, ఎస్ రవీంద్ర భట్, జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రా కరోనా సోకింది. కోవిడ్ సోకి జస్టిస్ సూర్యకాంత్  వారం క్రితం కరోనా నుంచి కోలుకున్నారు. ఈక్రమంలో సుప్రీంకోర్టులో స్వలింగ వివాహ కేసును భౌతికంగా విచారిస్తున్న ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో భాగంగా ఉన్న జస్టిస్ భట్ కు కోవిడ్ సోకింది.

వారితో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే జస్టిస్ కౌల్ వైద్యపరమైన అత్యవసర కారణంగా కోర్టుకు సెలవు పెట్టారు. ప్రస్తుతం కేసుల పెండింగ్‌ను నివారించడానికి తాజా ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌లకు కేసులను కేటాయించారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. ఈక్రమంలో నలుగురు న్యాయమూర్తులకు కోవిడ్ సోకటంతో కేసుల విచారణ ఆందోళనకంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు విచారణ జరగాల్సిన కేసులు రద్దు అయ్యాయి.