India responds to UN: కొత్త ఐటీ రూల్స్‌పై ఐక్యరాజ్య సమితికి వివరణ ఇచ్చిన ఇండియా

కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది.

India responds to UN: కొత్త ఐటీ నిబంధనలపై ఇండియా ఐక్యరాజ్యసమతిలో స్పందించింది. సోషల్ మీడియా వినియోగదారులను బలోపేతం చేయడానికే వీటిని రూపొందించినట్లు పేర్కొంది. దీనిపై పలువురితో 2018లోనే చర్చించి నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. జూన్ 11న ఇచ్చిన మానవ హక్కుల మండలి స్పెషల్ ప్రొసీజర్ వింగ్ ముగ్గురు ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు గానూ రెస్పాన్స్ ఇస్తూ.. వివరణ ఇచ్చింది.

ఐక్యరాజ్యసమితి ఇండియన్ గవర్నమెంట్.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021.. 2021 ఫిబ్రవరి 25న ప్రకటించిన ఐటీ రూల్స్ ఒకేలా ఉన్నాయని చెప్పింది. ఇవి 2021 మే 26 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

‘సోషల్ మీడియా సామాన్య వినియోగదారుల కోసం ఈ రూల్స్ డిజైన్ చేశాం. సోషల్ మీడియాలో పలు కారణాల కారణంగా నష్టపోయిన బాధితుల కోసం ఫోరం ఏర్పాటు చేశాం. వాటాదారులతో చర్చించిన తర్వాత ఐటీ రూల్స్ ను ఫైనలైజ్ చేశాం. కొత్త ఐటీ రూల్స్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు ఆటంకంగా మారాయనేది తప్పుదోవ పట్టించడమే’ అని గవర్నమెంట్ రాసుకొచ్చింది.

కొత్త రూల్స్ ప్రకారం.. ఇన్ఫర్మేషన్ ముందుగా ఎక్కడ పుట్టిందనేది ట్రేస్ చేయొచ్చు. ఆల్రెడీ పబ్లిక్ లో ఉన్న సమాచారం.. హింసను పెంచేదిగా, ఐక్యతను భంగపరిచే విధంగా, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులు వంటివి ఇకపై జరగవు’ అని ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి రాసిన లెటర్ లో చెప్పింది.

ట్రెండింగ్ వార్తలు