కదులుతున్న రైల్లో… బిడ్డకు ప్రాణం పోసిన ఆర్మీ డాక్టర్లు

  • Publish Date - December 29, 2019 / 10:21 AM IST

భారత సైన్యం ఎల్లప్పుడు దేశానికి సేవ చేయటమే కాదు ఎటువంటి సమస్యలైన స్పందించి, పరిష్కరించే లక్షణం ఉందని ఆర్మీ మహిళా వైద్యాధికారులు చాటి చెప్పారు. అసలు వివరాల్లోకి వెళ్లితే 172 మిలటరీ ఆస్పత్రికి చెందిన ఆర్మీ వైదులు కెప్టెన్ లతితా,కెప్టెన్ అమన్ దీప్ హౌరా ఎక్ప్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా ఓ మహిళా శిశువునే ప్రసవించే క్రమంలో 
ఆమెకు వైద్యులు సహాయం అవసరమైంది. అవిధంగా ఆర్మీ వైద్యులు తమ వృత్తి ధర్మాన్ని వారు పాటించారు. ఆమెకు దగ్గర ఉండి కాన్పు చేశారు. ఆ మహిళా ప్రయాణికురాలు క్షేమంగా పడంటి ఆడబిడ్డకు జన్మించింది.

 

ఇండియన్ ఆర్మీ అదనపు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి తల్లి,బిడ్డ క్షేమంగా ఉన్నారని తన ట్విటర్ లో షేర్ చేశారు. ఆర్మీ మహిళా అధికారులు చూపించిన ధైర్యానికి, మాన్వతానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు. నిజమైన హీరోలంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలోనైనా ఆర్మీ అధికారులు తమ సేవలను అందిస్తారని నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.